»   » ఇంతవరకూ ఇలా జరగలేదు., వర్మ పుట్టినరోజునే సర్కార్ 3

ఇంతవరకూ ఇలా జరగలేదు., వర్మ పుట్టినరోజునే సర్కార్ 3

Posted By:
Subscribe to Filmibeat Telugu

గాడ్‌ ఫాదర్‌ సుభాష్‌ సర్కార్‌ నాగ్రే పాత్రలో అమితాబ్‌ నటించిన తాజా చిత్రం 'సర్కార్‌-3'. రామ్‌గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం సర్కార్ సిరీస్‌లో 3వ భాగం కావడం విశేషం. ఇదివరకు వచ్చిన రెండు పార్ట్‌లు సూపర్ సక్సెస్ సాధించడంతో.. మూడో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు రామ్‌గోపాల్ వర్మ.

సర్కార్‌ సీరీస్ లో భాగంగా ఈ మూడో భాగాన్ని తెరకెక్కించారు. మనోజ్‌ బాజ్‌పాయ్‌, యామీ గౌతమ్‌, జాకీ ష్రాఫ్‌ కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పరాగ్‌ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్‌ ఎ. లుల్లా తో కలిసి అమితాబ్‌ బచ్చన నిర్మిస్తున్నారు. షూటింగ్‌ పూర్తయింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుగుతున్నాయి.

'Sarkar 3' coming on April 7

రామ్‌గోపాల్‌వర్మ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా అమితాబ్‌కు చెందిన ఓ ఫొటోను కూడా విడుదల చేశాడు. అయితే తన 25ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలా బర్త్‌డే రోజున వర్మ తొలిసారిగా తాను డైరక్ట్ చేసిన సినిమాను విడుదల చేస్తుండటం విశేషం.జనవరి 23న శివసేన లీడర్ బాల్ థాకరే జయంతి సందర్భంగా సర్కార్ చిత్ర టీజర్ విడుదల కానుందంటూ ప్రచారం జరిగింది. కాని అవన్నీ అవాస్తవాలే అని తేలింది.

ఇక చిత్ర టీజర్ లేదా ట్రైలర్ విడుదల త్వరలోనే విడుదలవుతుందేమో అని అభిమానులు ఆశగా ఎదురు చూస్తున్న సమయంలో వర్మ సర్కార్ 3 రిలీజ్ డేట్ ప్రకటించాడు. ఏప్రిల్ 7న ఈ చిత్రం విడుదల కానుందంటూ అఫీషియల్ స్టేట్ మెంట్ ఇచ్చాడు. ఇక ఈ మధ్య వరుస ఫ్లాప్‌లతో కాస్త వెనుకబడ్డ వర్మ, ఈ మూవీతో మళ్లీ బాలీవుడ్‌లో సత్తా చూపాలని అనుకుంటున్నాడు. మరి వర్మ బర్త్‌డే అతడి సినిమా సక్సెస్‌కు ఏ మేరకు కలిసొస్తుందో చూడాలి.

English summary
Sarkar 3 which was originally set to be released on March 17 will now come out on April 7, which just happens to be Ram Gopal Varma’s birthday
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu