»   » వర్మ మళ్ళీ బౌన్స్ బ్యాక్ : ఫస్ట్ లుక్కే ఇలా ఉంటే ఇక సిన్మా అదిరిపోతున్నట్టే

వర్మ మళ్ళీ బౌన్స్ బ్యాక్ : ఫస్ట్ లుక్కే ఇలా ఉంటే ఇక సిన్మా అదిరిపోతున్నట్టే

Posted By:
Subscribe to Filmibeat Telugu

దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రూపొందిస్తున్న 'సర్కార్ 3' ఫస్ట్ లుక్ విడుదలైంది. వర్మ తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసిన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆయన శైలిలోనే ఉంది. ఈ చిత్రంలోని పాత్రలన్నింటిని ఒకేసారి తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వర్మ పరిచయం చేశారు. 'సర్కార్ 3' చిత్ర కథపరంగా అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్ లకు అవకాశం లేదని, అందుకే వాళ్లు ఈ చిత్రంలో లేరని వర్మ పేర్కొన్నారు.

ఆయా నటులు పోషించే పాత్రలను వర్మ వివరించారు. రామ్ గోపాల్ వర్మ రీసెంట్ టైమ్ లో వార్తల్లో బాగానే నానుతూ ఉన్నాడు. వంగవీటి మూవీ కోసం ఓ నెల్లాళ్లకు పైగా హంగామా చేసిన వర్మ.. ఇప్పుడు చిరంజీవి మూవీ ఖైదీ నంబర్ 150పై విమర్శలు చేస్తూ హైలైట్ అవుతున్నాడు. అలాగే బాలీవుడ్ లో వర్మ తీస్తున్న ప్రెస్టీజియస్ మూవీ పనులు కూడా శరవేగంగా పూర్తయిపోతున్నాయి.

 మెడలో రుద్రాక్షలు:

మెడలో రుద్రాక్షలు:


అమితాబ్ బచ్చన్ ప్రధానపాత్రలో రూపొందుతున్న సర్కార్ 3 ఫస్ట్ లుక్ ని రివీల్ చేశాడు వర్మ. మెడలో రుద్రాక్షలు ధరించి.. బ్లాక్ డ్రస్ వేసుకున్న అమితాబ్.. ఓ సాసర్ లో కాఫీ తాగుతూ ఈ పోస్టర్ లో కనిపిస్తారు. కళ్లజోడు లోంచే కంటి చూపుతో కంట్రోల్ చేస్తున్న బిగ్ బీ లుక్ చూస్తే.. బీభత్సంగా భయపెట్టేస్తున్నట్లు అనిపించక మానదు.

 బిగ్ బీ లుక్ :

బిగ్ బీ లుక్ :


ఐ పవర్ తోనే అంతా నియంత్రించడం ఏంటో బిగ్ బీ లుక్ చూస్తే అర్ధమవుతుంది. మరోసారి పవర్ ఫుల్ కేరక్టర్లో ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు అమితాబ్ సిద్ధమైపోతున్నారు. గతం లో కనిపించిన సేమ్ గెటప్ అయినా ఈ సారి అమితాబ్ లుక్ మరింత గ్రేట్ అనేలా ఉంది.

 రిలీజ్ డేట్ కూడా:

రిలీజ్ డేట్ కూడా:


సర్కార్ 3 ఫస్ట్ లుక్ తో పాటే రిలీజ్ డేట్ కూడా చెప్పేశాడు రామ్ గోపాల్ వర్మ. 17 మార్చ్ 2017న ఈ మూవీని రిలీజ్ చేయబోతున్నట్లు ఫస్ట్ లుక్ పోస్టర్లోనే వర్మ చెప్పేశాడు. సర్కార్ సిరీస్ లో మొదటి రెండు ఫిలిమ్స్ ఏ రేంజ్ లో హిట్ అయ్యాయో ప్రేక్షకులకు బాగానే తెలుసు.

 మళ్లీ బౌన్స్ బ్యాక్ :

మళ్లీ బౌన్స్ బ్యాక్ :


ఇప్పుడు సర్కార్3 పై ఇంతకు మించి అంచనాలు ఉండడంలో ఆశ్చర్యం లేదు. సర్కార్ 3తో బాలీవుడ్ లో వర్మ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవుతాడనే అంచనాలున్నాయి. ఇక ఈ చిత్రానికి సంబంధించి టీజర్ ఎప్పుడు విడుదల చేయాలనే దానిపై ఓ క్లారిటీకి ఇచ్చాడు వర్మ.

 బాల్ థాకరే జయంతి:

బాల్ థాకరే జయంతి:


జనవరి 23న సర్కార్ 3 టీజర్ విడుదల చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఆ రోజే వర్మ సర్కార్ 3 టీజర్ విడుదల చేయడానికి గల కారణమేంటా అని పరిశీలిస్తే ఆ రోజు శివసేన లీడర్ బాల్ థాకరే జయంతి. ఈ సందర్భంగా చిత్ర టీజర్ ని విడుదల చేయాలని ప్లాన్ చేశాడట.

 బాల్ థాకరే:

బాల్ థాకరే:


మరో ముఖ్యమైన విషయమేమంటే బాల్ థాకరేని చూసి ఇన్స్పైర్ అయిన వర్మ సర్కార్ లో అమితాబ్ పోషించిన సుభాష్ నగ్రే పాత్రని డిసైడ్ చేశాడట. ఈ పాత్రకు భారీ ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. సర్కార్ 3 చిత్రంలో మనోజ్ బాజ్ పేయ్, యామి గౌతమ్, జాకీ ష్రాఫ్ , రోనిత్ రాయ్ మరియు అమిత్ సద్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

 340 కోట్ల రూపాయల బడ్జెట్:

340 కోట్ల రూపాయల బడ్జెట్:


ఇక వర్మ ఆ మధ్య ప్రకటించిన న్యూక్లియర్ ప్రాజెక్ట్ దాదాపు 340 కోట్ల రూపాయల బడ్జెట్ తో రూపొందనుందని ఈ సినిమా కోసం, రెండు , మూడు సంవత్సరాల సమయాన్ని కేటాయించవలసి ఉంటుందని అన్నాడు వర్మ. శశికళ చిత్రాన్ని 2021లో తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు రిలీజ్ చేస్తానని ప్రకటించాడు.

English summary
Ram Gopal Varma unveiled the first look of major characters of his upcoming film Sarkar 3 late Sunday.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu