»   »  వర్మకి నొ డిస్ట్రిబ్యూటర్స్?

వర్మకి నొ డిస్ట్రిబ్యూటర్స్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Ram Gopal Varma
బచ్చన్ ఫ్యామిలీ మెంబర్స్ (అమితాబ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్యారాయ్) తో రామ్‌గోపాల్ వర్మ ప్రతిష్ఠాత్మకంగా రూపొందించిన చిత్రం 'సర్కార్ రాజ్'. జూన్‌లో ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. అయితే అదరకొడుతున్న ప్రోమోలతో మంచి క్రేజ్ తెచ్చుకున్న ఈ సినిమాకు డిస్ట్రిబ్యూటర్లు కరువయ్యారట. ప్రివ్యూ చూసిన వారంతా క్లైమాక్స్ చూసి పరారవుతున్నరనే వార్త బాలీవుడ్లో చర్చనీయాంశమయ్యింది. కారణం సినిమా క్లైమాక్స్‌లో అభిషేక్ చనిపోతాడని తెలిసింది. దాంతో ఈ సినిమా తీసుకుంటే ఆ క్లైమాక్స్ తమ కెరీర్ కి క్లైమాక్స్ గా మారుతుందని వారు భావిస్తున్నారట.

అందులోనూ 'రామ్‌గోపాల వర్మ కీ ఆగ్' దెబ్బనుండి చాలా మంది డిస్ట్రిబ్యూటర్లు ఇంకా కోలుకోలేదుట. దాంతో మళ్లీ ఆ తరహా అనుభవాన్ని వారు ఆశించడం లేదు. ఇక ఈ సినిమాలో అమితాబ్, అభిషేక్ తండ్రీకొడుకులుగా నటించారు. తన తండ్రి మాదిరిగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాజకీయ వ్యవస్థని మార్చాలని ఆశించే శంకర్ నాగ్రే పాత్రను చేశాడు అభిషేక్. చివరిలో అతన్ని విలన్లు కాల్చి చంపేస్తారట. ఈ క్లైమాక్స్‌ను ప్రేక్షకులు హర్షించరనీ, వారు దాన్ని తిరస్కరిస్తారనీ డిస్ట్రిబ్యూటర్లు సందేహిస్తున్నారు.కొంతమంది సాహసించి క్లైమాక్స్ మారిస్తే బావుంటుందని సూచనలు కూడా చేసారుట. వరస ఫ్లాపుల్లో ఉన్న వర్మ ఈ నేపథ్యంలో ఏం డెసిషన్ తీసుకుంటాడో చూడాలి అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు బాలీవుడ్ వారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X