Don't Miss!
- Sports
Ee Sala Cup Namde Trolls: పాపం ఆ ఆంటీకి జన్మలో పెళ్లి కాదేమో.. ఆర్సీబీ ఓటమితో ఆంటీ మీద నెటిజన్ల సెటైర్లు..!
- News
హైదరాబాద్ గ్రీన్ బావర్చి హోటల్లో భారీ అగ్నిప్రమాదం; 14 మందిని రక్షించిన ఫైర్ సిబ్బంది!!
- Lifestyle
మీరు మలవిసర్జన చేసినప్పుడు మీకు 'ఇలా' అనిపిస్తుందా? ఇది ప్రమాదకరమైన క్యాన్సర్ సంకేతమని మీకు తెలుసా?
- Technology
ఇన్ఫినిక్స్ నోట్ 12 స్మార్ట్‌ఫోన్ మొదటి సేల్స్ తగ్గింపు ఆఫర్లతో ప్రారంభమయ్యాయి!!
- Finance
బాలీవుడ్ బడా ప్రొడ్యూసర్‌కు క్రెడిట్ కార్డ్‌తో కుచ్చుటోపీ: రూ.లక్షలు దోపిడీ
- Automobiles
భారత్‌లో కీవే వియస్టా 300 మరియు కీవే సిక్స్టీస్ 300ఐ స్కూటర్లను విడుదల చేసిన బెనెల్లీ
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
Sarkaru Vaari Paata: రిలీజ్ రోజే మహేశ్‌కు బిగ్ షాక్.. ఇదంతా ఆ ఫ్యాన్స్ పనే అని అనుమానం
తెలుగు సినీ ఇండస్ట్రీలో యాక్టింగ్, ఫైట్స్, డ్యాన్స్, డైలాగ్స్ అన్నింటికీ మించి హ్యాండ్సమ్ లుక్స్‌తో ప్రేక్షకులను అలరిస్తూ తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని బడా హీరోగా ఎదిగిపోయాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. కెరీర్ ఆరంభంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకున్న అతడు.. అప్పటి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా దూసుకెళ్తున్నాడు.

ఈ క్రమంలోనే ఈ మధ్య కాలంలో ఏకంగా మూడు బ్లాక్ బస్టర్ హిట్లను కొట్టి సత్తా చాటాడు. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేశాడు. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాకు రిలీజ్ రోజే బిగ్ షాక్ తగిలింది. అసలేం జరిగింది? దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం!

సర్కారు వారి పాటతో మహేశ్ ఎంట్రీ
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటించిన తాజా చిత్రమే ‘సర్కారు వారి పాట'. పరశురాం పెట్ల తెరకెక్కిస్తోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్‌గా నటించింది. దీన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ సంస్థలతో కలిసి మహేశ్ స్వయంగా నిర్మించాడు. ఈ చిత్రానికి మ్యూజిక్ సెన్సేషన్ థమన్ సంగీతాన్ని అందించాడు. ఇందులో సముద్రఖని విలన్‌గా నటించారు.
మళ్లీ రెచ్చిపోయిన హీరోయిన్ శ్రీయ: తడిచిన బట్టల్లో శృతి మించి మరీ దారుణంగా!

అంచనాలకు తగ్గట్లుగా ప్రీ బిజినెస్
వరుస విజయాల తర్వాత మహేశ్ బాబు నటించిన సినిమా కావడంతో ‘సర్కారు వారి పాట'పై ఆది నుంచే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీని నుంచి విడుదలైన టీజర్, పాటలు, ట్రైలర్‌కు భారీ స్థాయిలో రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఇది మరింత క్రేజ్‌ను అందుకుంది. ఫలితంగా దీనికి అన్ని ప్రాంతాల్లో కలిపి రూ. 120 కోట్ల బిజినెస్ జరిగింది.

గ్రాండ్ రిలీజ్.. థియేటర్లు సందడి
విడుదలకు ముందే భారీ హైప్ క్రియేట్ చేసుకున్న ‘సర్కారు వారి పాట' మూవీ ఈరోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీన్ని ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2150కు పైగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు. దీంతో అన్ని థియేటర్లూ ప్రేక్షకులతో కళకళలాడుతున్నాయి. మరీ ముఖ్యంగా ఏపీ, తెలంగాణలోని సినిమా హాళ్లన్నీ మెగా అభిమానులతో రచ్చతో సందడిగా మారిపోయాయి.
Bigg Boss Non Stop: బిందుపై నటరాజ్ అసభ్య వ్యాఖ్యలు.. అవి చూపించడానికే అలాంటి బట్టలు అంటూ!

అంతటా విడుదల.. అలాంటి టాక్
క్రేజీ
కాంబినేషన్‌లో
రూపొందిన
‘సర్కారు
వారి
పాట'
మూవీకి
సంబంధించి
ఇప్పటికే
ఓవర్సీస్
సహా
తెలుగు
రాష్ట్రాల్లోని
చాలా
ప్రాంతాల్లో
షోలు
ప్రదర్శితం
అయిపోయాయి.
అన్ని
చోట్లా
దీనికి
మంచి
స్పందన
దక్కింది.
దీంతో
షోలన్నీ
హౌస్‌ఫుల్
అయిపోయాయి.
అయితే,
టాక్
మాత్రం
మిశ్రమంగా
వస్తోంది.
కొందరు
ఈ
సినిమా
బాగుందని
అంటే..
మరికొందరు
ఏవరేజ్
అంటున్నారు.

విడుదలైన రోజే మహేశ్‌కు బిగ్ షాక్
దాదాపు
రెండున్నరేళ్ల
తర్వాత
‘సర్కారు
వారి
పాట'
మూవీతో
సూపర్
స్టార్
మహేశ్
బాబు
బిగ్
స్క్రీన్‌పై
సందడి
చేస్తున్నాడు.
దీంతో
అతడి
అభిమానుల
ఆనందానికి
అవధులు
లేకుండా
పోయాయి.
ఫలితంగా
వాళ్లంతా
ఈ
సినిమా
విడుదలను
పండుగలా
జరుపుకుంటున్నారు.
ఇలాంటి
పరిస్థితుల్లో
ఈ
ప్రతిష్టాత్మక
చిత్రానికి
విడుదలైన
రోజే
ట్విట్టర్
వేదికగా
బిగ్
షాక్
తగిలింది.
దీప్తి సునైనా అందాల ఆరబోత: అలాంటి బట్టల్లో గతంలో చూడనంత హాట్‌గా!

ట్విట్టర్‌లో డిజాస్టర్ ట్యాగ్ ట్రెండ్
సూపర్
స్టార్
మహేశ్
బాబు
నటించిన
‘సర్కారు
వారి
పాట'
మూవీ
ఇప్పటికే
ప్రేక్షకుల
ముందుకు
వచ్చేసింది.
ఈ
నేపథ్యంలో
ట్విట్టర్‌లో
DisasterSVP
అనే
హ్యాష్
ట్యాగ్
విపరీతంగా
ట్రెండ్
అవుతోంది.
ఇందులో
ఈ
సినిమా
డిజాస్టర్
అయిందని
చాలా
రకాలుగా
ట్రోల్స్
చేస్తూ
ట్వీట్లు
కనిపిస్తున్నాయి.
ఇప్పటికే
దీనిపై
పది
వేలకు
పైగా
ట్వీట్లు
కూడా
వచ్చేశాయి.

ఇదంతా ఆ ఫ్యాన్స్ పనే అంటూ
DisasterSVP
హ్యాష్
ట్యాగ్
ట్రెండింగ్
అవడంతో
సూపర్
స్టార్
మహేశ్
బాబు
అభిమానులు
కూడా
ధీటుగానే
స్పందిస్తున్నారు.
ఇదంతా
యాంటీ
ఫ్యాన్స్
చేసే
పనే
అంటూ
ఆరోపిస్తున్నారు.
అంతేకాదు,
సినిమా
చాలా
బాగుందని..
కావాలనే
దీనిపై
ప్రతికూల
రివ్యూలను
షేర్
చేస్తున్నారని
అంటున్నారు.
దీంతో
మహేశ్
బాబు
సినిమా
మరింతగా
ట్రెండ్
అయిపోతోంది.