»   »  ‘సరైనోడు’అప్ డేట్స్ బై బన్ని & తమన్

‘సరైనోడు’అప్ డేట్స్ బై బన్ని & తమన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్‌: అల్లు అర్జున్ ఎప్పడూ సోషల్ నెట్ వర్కింగ్ సైట్ల్ లో ఉషారుగా ఉంటూంటాడు. ఆయన తన చిత్రాల అప్ డేట్స్ గురించి ఎప్పటికప్పుడు తన అభిమానులకు సమాచారం ఇస్తూంటాడు. తాజాగా అల్లు అర్జున్‌ హరో గా నటిస్తున్న చిత్రం ‘సరైనోడు'.ఈ చిత్రం అప్ డేట్స్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. అందుకే...తన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట్టి ఆ విషయాలు తెలియచేసారు. ఆయనేం పోస్ట్ చేసారో క్రింద చూడండి మరి..

Sarrainodu audio mixing in final stages, audio release soon.#TeamAA

Posted by Allu Arjun on 2 March 2016

ఈ చిత్రం ఆడియో మిక్సింగ్‌ పనులు చివరి దశకు చేరుకున్నాయని అల్లు అర్జున్‌ తన ఫేస్‌బుక్‌ ఖాతా ద్వారా తెలిపారు. అలాగే త్వరలో ఆడియో విడుదల వేడుకలను నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. మరో ప్రక్కన సంగీత దర్శకుడు తమన్ కూడా తన ట్వీట్ ద్వారా ఈ చిత్రం అప్ డేట్స్ ఇచ్చే ప్రయత్నం చేసారు.


బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్‌ పతాకంపై అల్లు అరవింద్‌ నిర్మిస్తున్నారు. రకుల్‌ప్రీత్‌ సింగ్‌, కేథరిన్‌ హీరోయిన్స్. ఇటీవల విడుదల చేసిన ఈ చిత్రం టీజర్‌కు మంచి రెస్పాన్స్ లభించిన సంగతి తెలిసిందే.

మరో ప్రక్క ఈ చిత్రం ఏప్రియల్ 8, 2016 న విడుదల చేయటానికి తేదీ ని ఖరారు చేసినట్లు సమాచారం. అయితే ఈ విషయమై అధికారిక ప్రకటన ఏమీ లేదు. ఇక మాస్‌, యాక్షన్‌, వినోదం ఇలా ఎలాంటి కథలో అయినా ఇట్టే ఇమిడిపోతాడు అల్లు అర్జున్‌. 'సన్నాఫ్‌ సత్యమూర్తి'తో కుటుంబ ప్రేక్షకులకూ దగ్గరయ్యాడు. హీరోలోని వీరత్వాన్ని ఓ స్థాయిలో చూపించే దర్శకుడు బోయపాటి శ్రీను కావటంతో వీళ్లిద్దరి కలయికలో రూపొందుతోన్న ఈ చిత్రం ఎలా ఉండబోతోందనేది అందరిలో ఆసక్తి నెలకొంది.

English summary
Thaman was started his work for the final mixing of Sarrainodu for the blasting audio release.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu