»   » సరైనోడు...హిట్టా, ఫట్టా అనవసరం, గోల్ రీచయ్యా: అల్లు అర్జున్

సరైనోడు...హిట్టా, ఫట్టా అనవసరం, గోల్ రీచయ్యా: అల్లు అర్జున్

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అల్లు అర్జున్ హీరోగా బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'సరైనోడు'.ఇటీవల విడుదలైన ఈచిత్రం బాక్సాఫీసు వద్ద ఫర్వాలేదనే టాక్ తో దూసుకెలుతోంది. సినిమాకు మంచి వసూళ్లు వస్తుండటంతో హైదరాబాద్ లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్ ఏర్పాటు చేసారు.

ఈ సందర్బంగా అల్లు అర్జున్ మాట్లాడుతూ....'సరైనోడు' సినిమా హిట్టా, కాదా అనే విషయాలను పక్కనపెడితే నా గోల్‌ రీచ్ అయ్యాను. ఈ సినిమాతో మాస్‌లోకి వెళ్లాల‌నే నా గోల్ 200 శాతం నెర‌వేరింది. స్క్రిప్ట్ న‌చ్చి ఒప్పుకున్నా. ఫ‌స్టాఫ్‌లో కోర్టు సీను, సెకండాఫ్‌లో ఎమోష‌న‌ల్ సీను సినిమాను షిఫ్ట్ గేర్ చేశాయి. బోయ‌పాటిగారు చెప్పిన క‌థ‌ను చాలా బాగా తెర‌పై ట్రాన్స్ లేట్ చేశారు.. నా సినిమా ఆడినా, ఆడకపోయినా తెరమీద చూడటానికి బావుండాలనే పిచ్చి నాకుంటుంది. దానికి సహకరించి టెక్నికల్‌గా మంచి టీమ్‌నిచ్చిన నాన్నగారికి థాంక్స్ అన్నారు.

గీతా ఆర్ట్స్ లో నేను ఇంత‌కు ముందు చేసిన హ్యాపీ, భ‌ద్రినాథ్ పెద్ద‌గా ఆడ‌లేదు. కానీ మంచి హిట్‌ను ఈ సినిమాతో కొట్టాన‌నే తృప్తి ఉంది. నేను కోరిన గొంతెమ్మ కోరిక‌ల‌ను తీర్చిన మా నాన్న నా కెరీర్‌లోమంచి గ్రాస‌ర్‌ని ఇచ్చారు. నాతోనే కాదు చిరంజీవిగారితో పనిచేసిన రోజుల్లోనూ ఆల్‌టైమ్ గ్రాస‌ర్‌లు ఇచ్చేవారు. ప‌వ‌న్‌క‌ల్యాణ్‌గారికి జ‌ల్సా, చ‌ర‌ణ్‌కి మ‌గ‌ధీర‌, నాగ‌చైత‌న్య‌కు 100ల‌వ్‌, నానికి భ‌లే భ‌లే మ‌గాడివోయ్ ఇచ్చారు. ఇప్పుడు నాకు ఈ సినిమాను ఇచ్చారు అని బన్నీ చెప్పుకొచ్చారు.

అంతా నేను బాగా కష్టపడతానని అంటుంటారు. కానీ నాక‌న్నా ఎక్కువ‌గా బోయ‌పాటి క‌ష్ట‌ప‌డతారు. 40 నుండి 50 రోజులు నిద్ర లేకుండా పని చేసారు. ఆయ‌న క‌ష్టం కోస‌మైనా సినిమా హిట్ కావాల‌ని అనుకునేవాడిని అని బన్నీ చెప్పుకొచ్చారు.

బన్నీ బాధ పడ్డాడు

బన్నీ బాధ పడ్డాడు


అల్లు అరవింద్‌ మాట్లాడుతూ ‘‘బన్ని, బోయపాటి కెరీర్‌లో బెస్ట్‌ గ్రాసర్‌గా నిలిచిందీ సినిమా. కథ మీద ఉన్న నమ్మకం ఎక్కువ ఖర్చుపెట్టిస్తుంది. ‘నేను ఇంకా మాస్‌లోకి వెళ్లలేదేమో నాన్నా' అని ఒకసారి బన్ని బాధ పడ్డారు' అని తెలిపారు.

అప్పుడే బోయపాటి గురించి చెప్పా

అప్పుడే బోయపాటి గురించి చెప్పా


కొడితే రెండు ముక్కలై మాస్‌లోకి చేర్చగల దర్శకుడు బోయపాటి అని అపుడు బన్నీకి చెప్పాను. ఆరు మాసాలు గడువుతీసుకుని బోయపాటి ఈ కథను చెప్పారు. కంటెంట్‌ మీద రిస్క్‌ పెట్టి సినిమా చేశాను. బోయపాటి చాలా కష్టపడ్డారు. సినిమాకు పనిచేసిన ప్రతి ఒక్కరూ కష్టపడ్డారు అని అరవింద్ తెలిపారు.

థియేటర్లు పెంచాం

థియేటర్లు పెంచాం


ఆదివారం థియేటర్లను పెంచాం. సోమవారం మ్యాట్నీ ఫాస్ట్‌గా ఫిల్‌ కావడంతో నేను వసూళ్ల లెక్కలు వేసుకోవడం మొదలుపెట్టాను. గీతా ఆర్ట్స్‌లో తీసే చిత్రాలను మేమే పంపిణీ చేసి లాభాలను చూడాలనే ఉద్దేశంతోనే చేస్తాం అన్నారు అరవింద్

గొంతమ్మ కోరిక చాక్లెట్ అడిగినంత తేలిగ్గా..

గొంతమ్మ కోరిక చాక్లెట్ అడిగినంత తేలిగ్గా..


బన్ని గొంతెమ్మ కోరికలను కూడా చిన్నపిల్లాడు చాక్లెట్‌ను అడిగినంత తేలిగ్గా అడుగుతాడు అని అరవింద్ చెప్పుకొచ్చారు.

చిరంజీవి అభినందించారు

చిరంజీవి అభినందించారు


సినిమా బ్లాక్‌బస్టర్‌ హిట్‌ అయినందుకు ఆనందంగా ఉంది. అరవింద్‌గారు నాపై బాధ్యత పెట్టారు. నా డబ్బు కోసం కాకపోయినా, నన్ను నమ్మి డబ్బు పెట్టే డిస్ట్రిబ్యూటర్లు, ప్రేక్షకుల కోసమైనా హిట్‌ కొట్టాలని చేశాను. సినిమాకు వస్తున్న రెవెన్యూస్‌ చూస్తుంటే హ్యాపీగా ఉంది. చిరంజీవి గారి అభినందనను మర్చిపోలేను అని అన్నారు.

English summary
Allu Arjun, Saikumar, Rakul Preet Singh, Catherine Tresa, Boyapati Srinu, Allu Aravind, Rishi Punjabi, Srikanth, Aadhi, Vidyullekha Raman, Shilpa Chakravarthy, Ram Laxman, Ramajogayya Sastry graced the event.
Please Wait while comments are loading...