»   » సతురంగ వేట్టై.... సూపర్ సెన్సెషన్ ఇప్పుడు తెలుగు తెర మీద

సతురంగ వేట్టై.... సూపర్ సెన్సెషన్ ఇప్పుడు తెలుగు తెర మీద

Posted By:
Subscribe to Filmibeat Telugu

త‌మిళంలో ఎలాంటి ఎక్స్ పెక్టేష‌న్స్ లేకుండా చిన్న చిత్రంగా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యం మూట‌గ‌ట్టుకున్న చిత్రం చ‌దురంగ వేట్టై తెలుగులో రీమేక్ అవుతోంది. ఇటీవ‌లే జెంటిల్‌మ‌న్తో ఘ‌న విజ‌యాన్ని సొంతం చేసుకున్న శ్రీదేవి మూవీస్ సంస్థ ఈ చిత్రాన్ని స‌మ‌ర్పిస్తోంది. క్ష‌ణంతో హీరోగా ఒక ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ తెచ్చుకుని ప్ర‌స్తుతం ప‌లు చిత్రాల్లో న‌టిస్తున్న అడివి శేష్ ఇందులో క‌థానాయ‌కుడు.

ఎక్క‌డికిపోతావు చిన్న‌వాడా ఫేమ్ నందితా శ్వేత నాయిక‌గా ఎంపిక‌య్యారు. శ్రీదేవి మూవీస్ శివ‌లెంక కృష్ణ‌ప్ర‌సాద్ స‌మ‌ర్పిస్తున్నారు. అభిషేక్ ఫిలిమ్స్ ప‌తాకంపై ర‌మేశ్‌.పి.పిళ్లై నిర్మిస్తున్నారు. గోపీ గ‌ణేశ్ ఈ చిత్రానికి ద‌ర్శ‌కుడు. వ‌సంత పంచ‌మిని పుర‌స్క‌రించుకుని

'Sathuranga Vettai' to be remade in Telugu

బుధ‌వారం హైద‌రాబాద్‌లోని సినిమా కార్యాల‌యంలో పూజా కార్య‌క్ర‌మాలు జ‌రిగాయి. ప్ర‌స్తుతం ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయని. ఏప్రిల్ నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లు పెడ‌తామ‌ని, జులైలో సినిమాను విడుద‌ల చేస్తామ‌ని నిర్మాత‌లు తెలిపారు. ఈ చిత్రానికి మాట‌లు : కిర‌ణ్ త‌ట‌వ‌ర్తి.

English summary
Thirrupathi brothers' recent release Sathuranga Vettai is getting superb positive reviews from the media and the reception in Tamil Nadu box office is equally good. Now the latest is that the talks are on for remaking the film in Telugu
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu