»   » కట్టప్ప ఇంటర్వ్యూ: అందుకే బాహుబలిని చంపా, ‘దొర’గా భయపెడతా!

కట్టప్ప ఇంటర్వ్యూ: అందుకే బాహుబలిని చంపా, ‘దొర’గా భయపెడతా!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: నటుడు సత్యరాజ్ ఎవరు అంటే ప్రతి ఒక్కరికి వెంటనే వెలగకపోవచ్చుగానీ... కట్టప్ప ఎవరు అంటే చిన్నపిల్లాడిని అడిగినా ఇతడే అని చూపిస్తారు. 'బాహుబలి' సినిమాతో కట్టప్ప నేషనల్ లెవల్లో ఫేమస్ అయ్యాడు.

'బాహుబలి' సినిమాతో పాటు తెలుగులో మిర్చి, బ్రహ్మోత్సవం, నేను శైలజ లాంటి సినిమాల్లో తండ్రి పాత్రలో అద్భుతంగా చేసి ప్రేక్షకుల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయారు. తండ్రి అంటే ఇలానే ఉండాలి అనేంతగా ఆయన ఆ పాత్రలో జీవించారు.

అయితే ఈ సారి కట్టప్ప ఎవరూ ఊహించని విధంగా ప్రేక్షకులను భయపెట్టబోతున్నాడు. ధరణీధరన్‌ దర్శకత్వంలో ఆయన కీలక పాత్రలో నటించిన చిత్రం తమిళ చిత్రం 'జాక్సన్‌ దొరై' తెలుగులో 'దొర' పేరుతో ఈ చిత్రాన్ని జులై 1న విడుదల చేయనున్నారు. ఈ చిత్రంలో ఆయన తనయుడు శిబిరాజ్‌ కూడా నటించారు.

తాజాగా ఇంటర్వ్యూలో ఆయన సినిమా గురించి వెల్లడిస్తూ ఇది పీరియాడికల్‌ హరర్‌ సినిమా అని తెలిపారు. కామెడీ, సస్పెన్స్‌, థ్రిల్లింగ్‌ అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు వెల్లడించారు. మంచి కథ కావడం, హారర్ సినిమాల ట్రెండు నడుస్తున్న నేపథ్యంలో ఈ సినిమాను అంగీకరించినట్లు తెలిపారు.

స్లైడ్ షోలో కట్టప్ప బాహుబలి గురించి చెప్పి విశేషాలు, 'దొర' మూవీ ఫోటోస్..

కట్టప్ప అంటున్నారు

కట్టప్ప అంటున్నారు

తాను గత 38 సంవత్సరాలుగా సినిమాల్లో ఉన్నప్పటికీ....‘బాహుబలి' తర్వాత నన్ను అంతా ‘కట్టప్ప'గానే పిలుస్తున్నారు. చిన్నారులూ కూడా అంతే కూడా అలానే పిలుస్తున్నారు అని సత్యరాజ్ తెలిపారు.

జీవితంలో ఒక్కసారే

జీవితంలో ఒక్కసారే

ఈ క్రెడిట్‌ అంతా రాజమౌళిదే. కట్టప్ప లాంటి పాత్ర జీవితంలో ఒక్కసారి మాత్రమే ఇలాంటి పాత్ర వస్తుంది అన్నారు సత్యరాజ్.

అందుకే చంపాను

అందుకే చంపాను

బాహుబలి సినిమా తర్వాత ...కట్టప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? అనే ప్రశ్న చాలా మంది అడిగారు...ఆ ప్రశ్నకు నా నుండి వచ్చే సమాధానం ఒక్కటే... ‘రాజమౌళి చెప్పారు.. నేను చంపాను..'

మరింత బలంగా

మరింత బలంగా

ప్రస్తుతం రెండో భాగం ‘బాహుబలి: ది కంక్లూజన్‌' చిత్రకరణ శరవేగంగా జరుగుతోంది. ఇందులో నా పాత్ర మరింత బలంగా ఉంటుంది అని సత్యరాజ్ తెలిపారు.

English summary
Sathya Raj latest movie in Tamil is coming to the screens in AP and Telangana. Titled 'Dora', the movie is directed by Dharani Dharan and Jakkam Haribabu is producing it. This horror thriller is set for release on 1st July.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu