»   » బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటే.. గుట్టువిప్పిన సత్యరాజ్

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడంటే.. గుట్టువిప్పిన సత్యరాజ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

బహుబలి చిత్రం అంతర్జాతీయంగా ఎంత ప్రభంజనం సృష్టించిందో మనకు తెలుసు. ఆ చిత్రం ఎంత విజయవంతమైందో బహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే అంశం అంతకంటే ఎక్కువ హిట్ అయింది. బహుబలి విడుదల తర్వాత ప్రతి ఒక్కరిని వెంటాడుతున్న ప్రశ్నగా మిగిలింది. బాహుబలి హత్య వెనుక ఉన్న రహస్యాన్ని తెలుసుకోవడానికి ప్రేక్షకులు బాహుబలి2 కోసం కాచుకొని వేచిచూస్తున్నారు. ఇటీవల 2017 ఇండియా టుడే కాంక్లేవ్ సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో దర్శకుడు రాజమౌళి, కట్టప్ప పాత్రధారి సత్యరాజ్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

బాహుబలిని ఎందుకు చంపానంటే..

బాహుబలిని ఎందుకు చంపానంటే..

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. ‘బాహుబలిని డైరెక్టర్ రాజమౌళి చంపమన్నారు. అందుకే నేను చంపాను. అంతకు మించి నాకు ఏమి తెలియదు. బాహుబలి కంక్లూజన్‌ చూస్తే ఆ విషయం తెలుస్తుంది' అని అన్నారు.


 నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నారు..

నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నారు..

బాహుబలి చిత్రం విడుదల తర్వాత ఊహించని విధంగా తమను ఈ ప్రశ్న వెంటాడుతున్నది. అయితే తాను బాహుబలిని వేధించలేదు అని సత్యరాజ్ వెల్లడించారు. ప్రతి ఒక్కరు మమ్మల్ని ఇదే ప్రశ్న అడిగి అడిగి వేధిస్తున్నారు. నేను కూడా చాలా ఇరిటేట్ అవుతున్నాను అని చెప్పారు.


నా ఫ్యామిలీకి కూడా చెప్పలేదు

నా ఫ్యామిలీకి కూడా చెప్పలేదు

బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపారనే విషయాన్ని ఇప్పటివరకు నా కుటుంబ సభ్యులకు కూడా చెప్పలేను. సినీ పరిశ్రమలో నా జీవితం 40 ఏండ్లు. ఓ కథకు సంబంధించిన ఓ కీలక సన్నివేశాన్ని గానీ, క్లైమాక్స్‌ను గానీ ఇప్పటివరకు ఎవరికీ చెప్పలేదు. లీక్ చేయలేదు.


నా పాత్ర హిట్ అవుతుందని ముందే తెలుసు..

నా పాత్ర హిట్ అవుతుందని ముందే తెలుసు..

బాహుబలి చిత్రంలో నా పాత్ర చాలా ఫేమస్ అవుతుందని నాకు ముందే తెలుసు. కానీ ఇంత పెద్ద మొత్తంలో ప్రజాదరణ పొందుతుందని ఊహించలేదు. పాత్రకు సంబంధించిన చిత్రాన్ని వివిధ పరిస్థితులకు ఉపయోగించుకొన్నారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు అప్పుడు కూడా కట్టప్ప క్యారెక్టర్ విపరీతంగా వాడుకొన్నారు. అందుకు నాకు చాలా సంతోషం కలిగింది.


బాహుబలి, భల్లాల దేవ ఫైట్ హైలెట్

బాహుబలి, భల్లాల దేవ ఫైట్ హైలెట్

‘బాహుబలి2 చిత్రంలో బాహుబలి, భల్లాల దేవ మధ్య జరిగే ఫైట్ సీక్వెన్స్ చిత్రానికే హైలెట్‌గా నిలుస్తుంది. బాహుబలి ట్రైలర్‌ను మార్చి మూడో వారంలో విడుదల చేసే అవకాశముంది. బహుబలి కంటే బాహుబలి2 అద్భుతంగా ఉంటుంది' అని రాజమౌళి తెలిపారు.


ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు వసూలు

ప్రపంచవ్యాప్తంగా 600 కోట్లు వసూలు

2015లో విడుదలైన బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆదరణను చూరగొన్నది. ఆ చిత్రంలో నటించిన ప్రభాస్, రానాలకు మంచి పేరు తెచ్చింది. బాహుబలి చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.600 కోట్లను వసూలు చేసింది.


English summary
'Why did Katappa kill Baahubali?' is the Question most popular in Indian cinema. Sathyaraj, who plays the eponymous character Katappa in the film, has made an interesting revelation.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu