»   » నిర్మాతతో విభేధాలు: ‘సత్య-2’ వాయిదా

నిర్మాతతో విభేధాలు: ‘సత్య-2’ వాయిదా

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై : శర్వానంద్, అనైక జంటగా ముమ్మత్ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై రామ్‌గోపాల్‌వర్మ దర్శకత్వంలో సుమంత్‌కుమార్‌రెడ్డి మెట్టు నిర్మించిన చిత్రం 'సత్య-2' (వస్తున్నాడు). ఈ చిత్రం విడుదలని అక్టోబర్ 25న అనుకున్నారు కానీ...నిర్మాత అరుణ్ శర్మకు,దర్శకుడుకి మధ్య విభేధాలు తలఎత్తడంతో చిత్రాన్ని నవంబర్ 8 కి వాయిదా వేసారు. ఈ విషయాన్ని వర్మ ట్విట్టర్ తో తెలిపారు.

ఈ సినిమాను ఎం. సుమంత్ కుమార్ రెడ్డి మరియు 'ఎల్.ఆర్ ఆక్టివ్' కు చెందిన డా అరుణ్ కుమార్ నిర్మిస్తున్నారు. వర్మకు అరుణ్ కు మధ్య విభేధాలు కారణంగా సినిమా వాయిదాపడింది. "అరుణ్ కు మధ్య మన్స్పర్ధాల కారణంగా ఆయనను సినిమానుండి తొలగిస్తున్నాం... అందుకోసం సత్యా 2 ని వాయిదా వేస్తున్నా" అని ట్వీట్ చేశాడు

Satya 2

చిత్రం గురించి దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ మాట్లాడుతూ- తాను ముంబాయి వెళ్లిన తొలి రోజుల్లో అక్కడి పరిస్థితులను గమనించానని, మురికివాడలతోపాటుగా ధనవంతుల ఇళ్లను కూడా చూసిన కళ్లతో ఆలోచించి సత్య కథను రాసుకున్నానని, సినిమా పరిశ్రమకు రాకుండా తాను అండర్‌వరల్డ్‌కు వెళ్లివుంటే ఏంచేసేవాడిననే ఆలోచనతో చేశానని అన్నారు. సత్య ముందు తీసిన సినిమాలు క్లారిటీగా ఉన్నా ఆ తరువాత తాను ఇబ్బందిపడ్డానని, ఓ తెలివైన వ్యక్తి నేరాన్ని తన మార్గంగా ఎంచుకుని మాఫియాని ఏ విధంగా పరిపాలించగలడు అన్నదే ఈ చిత్రంలో ప్రధానాంశమని, తుపాకీ - కత్తి పట్టుకున్నవాడు తప్పక వాటికే బలౌతాడన్న కథనంతో రియలిస్టిక్‌గా ఈ చిత్రాన్ని నిర్మించానని, శర్వానంద్ ఈ పాత్రకు ఖచ్చితంగా సరిపోయాడని తెలిపారు.

వర్మ అభిమానినైన తాను ఆయన చిత్రాల్లో ఒక్కసారి నటించాలనుకున్నానని, అదృష్టవశాత్తూ ఈ చిత్రంలో ఓ మంచి పాత్రను చేశానని, తనను నమ్మి అవకాశం ఇచ్చిన ఆయనకు కృతజ్ఞతలని, తాను ఇప్పటివరకూ చేసిన సినిమాలన్నీ ఒక ఎతె్తైతే ఈ సినిమా మరో ఎత్తు అవుతుందని శర్వానంద్ తెలిపారు. నిజంగా జరిగిన సత్యాన్ని సినిమాటిక్‌గా చెప్పడం ఆలోచనలను ఓ ఆర్డర్‌లో పెట్టి ఓ సినిమా రూపొందించడం రామూకే చెల్లిందని పూరీ జగన్నాధ్ తెలిపారు.

క్రైమ్ గురించి తెలుసుకోవడమంటే ఆయనకిష్టమని, ఇప్పటివరకూ ఇండియాలో జరిగిన అన్ని రకాల నేరాల గురించి ఆయన తెలుసుకున్నారని, జీవితంలో పైకి రావాలనుకునేవారు సత్య-2 చిత్రం తప్పక చూడవచ్చని పూరీ వివరించారు. రామ్‌గోపాల్‌వర్మతో ఓ మంచి చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉందని చిత్ర నిర్మాత సుమంత్‌కుమార్ రెడ్డి తెలిపారు. ఈ చిత్రానికి సంగీతం:సంజీవ్, దర్శన్, నితిన్‌రైక్వర్, కెమెరా:వికాస్ సరఫ్, ఎడిటింగ్:జరీన్ జోస్, నిర్మాత:సుమంత్‌కుమార్ రెడ్డి మెట్టు, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:రామ్‌గోపాల్ వర్మ.

English summary
Ram Gopal Varma’s latest offering ‘Satya 2’ was supposed to release on this Friday. But now, the release of the movie has been postponed and will be releasing on 8th of November. The movie was originally produced by M Sumanth Kumar Reddy and Dr Arun Kumar Sharma of ‘LR Active’ is one of the producers of the film. Differences have cropped up between Ram Gopal Varma and Arun Sharma which led to the postponement of the movie. Ramu tweeted on this saying “Due to issues of an issue of L R active’s Arun Sharma we were strongly advised to disaccociate from him..so am postponing release of Satya 2”.
Please Wait while comments are loading...