»   » కత్రినా ఎంత అందంగా ఉందో, సాంగ్ అదిరింది (న్యూ సాంగ్ వీడియో)

కత్రినా ఎంత అందంగా ఉందో, సాంగ్ అదిరింది (న్యూ సాంగ్ వీడియో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కత్రినా కైఫ్, సిద్ధార్థ్ మల్హోత్రా జంటగా తెరకెక్కిన 'బార్ బార్ దేఖో' చిత్రం వచ్చే నెలలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. విడుదల సమయానికి సినిమాపై అంచనాలు భారీగా పెరిగేలా ప్లాన్ చేస్తున్నారు. కాలా చష్మా సాంగుతో ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కొద్ది రోజుల క్రితం ప్రారంభమైంది. ఆ సాంగ్ రిలీజ్ తర్వాత ఒక్కసారిగా అందరి దృష్టి ఈ సినిమా వైపు మళ్లింది. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన రెండో సాంగ్ 'సు ఆస్మాన్' రిలీజ్ చేసారు. కత్రి, సిద్ధార్థలపై చిత్రీకరించిన ఈ సాంగ్ ఫీల్ గుడ్ మ్యూజిక్, విజువల్స్ తో చాలా బాగుంది. ఈ సినిమాలో కత్రినా గత సినిమాల కంటే చాలా అందంగా కనిపిస్తుండటం విశేషం.

తొలుత రిలీజైన కాలా చష్మా సాంగ్ మాస్ బీట్ ఉంటే..... 'సు ఆస్మాన్' సాగ్ రొమాంటిక్ బీట్ తో యువతను ఆకట్టుకునే విధంగా ఉంది. ఈ సాంగు గురించి మీరు స్వయంగా చూస్తేనే బావుంటుంది. స్లైడ్ షోలో అందుకు సంబంధించిన సాంగ్స్ ఉన్నాయి. ఓ లుక్కేయండి మరి...

బార్ బార్ దేఖో

బార్ బార్ దేఖో

ఈ సినిమా టైమ్ ట్రావెల్ నేపథ్యంలో సాగుతుంది. సినిమా చూడటానికి లవ్ స్టోరీలా కనిపిస్తున్నా విభిన్నమైన కాన్సెప్టు ఎంచుకున్నారు.

కాన్సెప్టు కొత్తగా

కాన్సెప్టు కొత్తగా

ఇదో పూర్తి స్థాయి టైమ్ ట్రావెల్ మూవీ. ఈ సినిమాలో సిద్దార్థ్ మల్హోత్రా ఒక రోజు పడుకొని మళ్ళీ నిద్ర లేచాడంటే అతడి వయసు ఓ 15 ఏళ్ళు పెరిగిపోతుంది. అంటే ఇప్పుడు 2016 ఆగస్ట్ రాత్రి మనోడు పడుకొన్నాడనుకోండి, మళ్ళీ 2036లో నిద్రలేస్తాడు. సినిమా ఇప్పటి వరకు వచ్చిన ఇండియన్ సినిమాలకు భిన్నంగా సాగుతుంది.

హాలీవుడ్ మూవీలా.

హాలీవుడ్ మూవీలా.

హాలీవుడ్ లో ఇటీవల వచ్చిన "ఎడ్జ్ ఆఫ్ టుమారో" మరియు 2008లో వచ్చిన "ది క్యూరియస్ కేస్ ఆఫ్ బెంజమిన్ బుట్టో" కథల్ని తలపించేలా ఇటీవల విడుదలైన ట్రైలర్ ఉంది.

కొత్త సాంగ్ ఇదే..

తాజాగా విడుదైలన కొత్త సాంగ్ ఇదే. ఈ సాంగులో కత్రినా చాలా అందంగా ఉంది.

మాస్ సాంగ్

కాలా చస్మా.. మాస్ సాంగ్ ఇదే..

ట్రైలర్

సినిమాకు సంబంధించిన ట్రైలర్

English summary
After creating a massive frenzy with their film’s first song ‘Kala Chasma’, the makers of ‘Baar Baar Dekho’ have released film’s second song ‘Sau Aasmaan’. Catch hook paired with peppy beat, the song is a definitely a feel good track.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu