twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చిరంజీవితో చేయటం కుదరలేదు, నాది చిన్న పిల్ల మనస్తత్వం: ఇంకా చాలానే చెప్పింది

    హీరోయిన్ గౌతమి తమిళం లోనూ, మళయాళం లోనూ ఒక దశలో తాప్ హీరోయిన్ గా ఇటు తెలుగులోనూ దాదాపుగా అందరు హీరోలతో చేసింది.

    |

    హీరోయిన్ గౌతమి తమిళం లోనూ, మళయాళం లోనూ ఒక దశలో తాప్ హీరోయిన్ గా ఇటు తెలుగులోనూ దాదాపుగా అందరు హీరోలతో చేసింది. కొంత కాలం కింద క్యాసర్ బారిన పడి మళ్ళీ కోలుకున్న గౌతమి ఇప్పుడు సామాజిక సేవా, రాజకీయాల్లో చురుకుగా పాల్గొంటోంది. ఒక వెబ్ చానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన కూతురు సుబ్బులక్ష్మికి తాను మొట్టమొదటగా నేర్పించిన మాట 'నో' అని ఇంకా ఏం చెప్పిందీ అంటే చెప్పింది.

    నేను నేర్పించిన పదం ‘నో'

    నేను నేర్పించిన పదం ‘నో'

    "మా అమ్మాయి మాటలు నేర్చుకోవడం, పలకడం మొదలుపెట్టే ముందు నేను నేర్పించిన పదం ‘నో'. ‘వద్దు' అనే మాట చెప్పడం ముఖ్యంగా ఆడవాళ్లకు రాదు. ‘నో ' అని చెప్పలేకపోవడంతో నా జీవితంలో నేను చాలా ఇబ్బందులు పడ్డా. అదేవిధంగా, "నో" అని చెప్పడం చేతకాక నా చుట్టుపక్కలవాళ్లు కూడా ఎలాంటి ఇబ్బందులు పడ్డారో చూశా! ఈరోజున నా కూతురికి ఏదైనా ఇష్టం లేకపోతే, చాలా చక్కగా, అందంగా ‘నో' అని చెబుతుంది" అని చెప్పింది గౌతమి

     దాదాపు అందరు హీరోలతోనూ

    దాదాపు అందరు హీరోలతోనూ

    ఆర్టిస్ట్ ని కావాలనే తన తపన, తన తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్లనే తాను ఈ రంగంలోకి ప్రవేశించానని, పదహారేళ్ల వయసులో సినిమాల్లోకి వచ్చిన తాను, ఈ ఇండస్ట్రీని క్రమక్రమంగా అర్థం చేసుకున్నానని తెలిపింది. తెలుగు ఇండస్ట్రీలో దాదాపు అందరు హీరోలతోనూ నటించింది గౌతమి .

     రజనీకాంత్ సినిమా షూటింగ్ లో బిజీగా

    రజనీకాంత్ సినిమా షూటింగ్ లో బిజీగా

    చిరంజీవితో నటించే అవకాశాలు వచ్చినా నటించలేకపోయానని గౌతమి చెప్పిన గౌతమి ఆ అవకాశాలు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉండేదానినని గుర్తుచేసుకుంది. ఫలానా డైరెక్టర్ తో, ఫలానా హీరోతో చేయలేకపోయాననే బాధ తనకు ఉందని, ఈ ఆలోచన వచ్చినప్పుడు తనది చిన్నపిల్ల మనస్తత్వం అనిపిస్తుందట.

    ఇలా ఉండటం చాలా మంచిది

    ఇలా ఉండటం చాలా మంచిది

    ఇలా ఉండటం చాలా మంచిదిఈ జనరేషన్ లో ‘ఇది ప్రొఫెషనల్.. ఇది పర్సనల్' అనే స్పష్టత కనిపిస్తోంది. ఇలా ఉండటం చాలా మంచిది. గతంలో అయితే ఒక సెట్ లో నటీనటులందరూ కలిస్తే ఒక ఫ్యామిలీ కలిసినట్టుగా ఉండేది. అందరం కలిసి కూర్చుని, భోజనాలు చేస్తూ అన్ని విషయాలను షేర్ చేసుకునేవాళ్లం. నేను అయితే, సెట్స్ కు వెళితే ప్యాకప్ అనే వరకు కూడా బయట అడుగుపెట్టేదాన్ని కాదు. సెట్స్ లోనే కూర్చునే దాన్ని.

     నాకు ఓ కార్వాన్ ఉండేది

    నాకు ఓ కార్వాన్ ఉండేది

    డైలాగ్స్ విషయంలో హెల్ప్ చేయడం, ఎడిటింగ్ నోట్స్ రాయడం, ట్రాలీ తోయడం, షాట్ చూడటం.. ఒకవేళ ఏదీ చేయకపోతే ఒక పుస్తకం చదువుకుంటూ కూర్చునేదాన్ని. అప్పట్లోనే నాకు ఓ కార్వాన్ ఉండేది. ఆ రోజుల్లోనే ఓ టెంపో ట్రావెలర్ ని తీసుకుని మొత్తం రీమోడల్ చేసి, ఏసీతో పాటు అన్ని ఏర్పాట్లు చేసిన కార్వాన్ ని మా అమ్మ రెడీ చేయించింది.

    బయటనే కుర్చీ వేసుకుని కూర్చుంటా

    బయటనే కుర్చీ వేసుకుని కూర్చుంటా

    దీనిని అందరూ వచ్చి చూసేవారు. అయితే, అందులో కూర్చోవాలని నాకు ఎప్పుడూ అనిపించేది కాదు. ఇప్పటికీ, నేను షూటింగ్ కి వెళితే, కార్వాన్ ఉన్నప్పటికీ నేను బయటనే కుర్చీ వేసుకుని కూర్చుంటా' అని చెప్పుకొచ్చారు. కమల్ హాసన్ తో సహజీవనానికి బ్రేకప్ చెప్పాక ఎక్కువగా సోషల్ సర్వీస్‌లోనే గడుపుతోంది గౌతమి.

    English summary
    Actress Gautham who is a populer heroine in Sauth Cinima, in a latest Interview for a web Chonel.. shared these feelings with camera
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X