twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మహా నటి సావిత్రి వర్థంతి నేడే

    By Staff
    |

    Savitri
    అద్బుత నటనతో తెలుగు చిత్ర జగతిలో ఒక సువర్ణాధ్యాయాన్ని సృష్టించుకున్నఅభినేత్రి సావిత్రి 27వ వర్థంతి నేడు . శెలవంటూ..సావిత్రి కానరాని తీరాలకు వలస వెళ్ళిపోయినా , ఆమె నటించిన అజరామర చిత్ర రాజాలెన్నో ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. అభినయంలో, వాచకంలో ఇప్పటికీ సావిత్రిలా ఉండాలని కోరుకునే మహిళలు, హీరోయిన్లు ఉన్నారంటే ఎంత మాత్రం అతిశయోక్తి కాదు.

    సావిత్రి 1936, డిసెంబర్‌ 6న గుంటూరు జిల్లా చిర్రావూరులో జన్మించారు. తన సహచరుల ప్రోత్సాహంతో సినిమా అవకాశాల కోసం మద్రాసు చేరుకున్నారు. 1949లో తమిళ 'అగ్ని పరీక్ష' చిత్రంలో నటించే అవకాశం వచ్చినట్లే వచ్చి చేజారిపోవడంతో విజయవాడ తిరిగి వెళ్ళిపోయారు. ఆ తరువాత ఎల్‌.వి. ప్రసాద్‌ తీసిన సంసారం చిత్రంతో సావిత్రి తెరంగేట్రం చేశారు.

    ఆ తరువాత పాతాళ బైరవిలో ఐదు నిమిషాల నృత్యగీతంతో పాటు, గుర్తింపు లేని చిత్రాలలో చిన్న చిన్న పాత్రలెన్నో ధరించి సినీ రంగంలో స్థిరపడ్డారు. ఇదే సమయంలోపల్లెటూరు వంటి కొన్ని చిత్రాలలో హీరోయిన్‌గా నటించినా పెద్దగా గుర్తింపు రాలేదు. అయితే 1953లో డి.ఎల్‌. నారాయణ తీసిన దేవదాసు చిత్రం సావిత్రి నట జీవితాన్ని మలుపు తిప్పింది.

    ఆ సినియా విజయవంతం కావడంతో సావిత్రికి అవకాశాలు వెల్లువెత్తాయి. ఈ కోవలో 1955 లో వచ్చిన మిస్సమ్మ సావిత్రి నటజీవితంలో మైలురాయి. ఇక అక్కడ నుంచి సావిత్రికి తిరుగులేకపోయింది. వందలాది చిత్రాల్లో ప్రేయసిలా, భగ్న ప్రేమికురాలిగా, భార్యగా, వేశ్య గా, సోదరిగా, తల్లిగా, త్యాగమయిగా ఎన్నో పాత్రల్లో జీవించింది. సావిత్రి కేవలం తెలుగు భాషకే పరిమితం కాకుండా తమిళం, కన్నడ, హిందీ భాషలలో దాదా పు 250 చిత్రాలలో నటించారు.

    మిస్సమ్మ, దొంగ రాముడు, మాయా బజార్‌, మూగ మనసులు వంటి చిత్ర రాజలెన్నో ఆమె అభినయానికి గీటురాళ్ళు. అలాంటి సావిత్రి ఈ రోజు మన మధ్యలేకపోవటం భాధాకరమే కానీ టీవీల్లో ఆవిడ నటించిన చిత్రాలు వేసినప్పుడల్లా మన ఇంటి ఆడబడుచు మళ్ళి పుట్టింటికి వచ్చి,కబుర్లు చెప్పిన ఫీలింగ్ కలిగిస్తుంది. దటీజ్ సావిత్రి.

     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X