»   » మహానటి మంచితనానికి ఓ మచ్చుతునక..!!

మహానటి మంచితనానికి ఓ మచ్చుతునక..!!

Subscribe to Filmibeat Telugu

దేవదాసు, మాయాబజార్, మిస్సమ్మ, గుండమ్మకథ, మూగమనసులు ఇలా చెప్పుకుంటూపోతే మహానటి సావిత్రి జీవంపోసిన పాత్రలెన్నో..! అద్భుతమయిన నటనతో ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రవేసుకున్న సావిత్రి మహా నటే కాదు గొప్ప వ్యక్తిత్వం గల మనిషి. తనకు సాయం చేసిన వారెవరైనా ఆమె మరిచిపోదట. ఈ విషయం ఆమెలో కలసి మిస్సమ్మ, గుండమ్మకథ, మూగమనసులు చిత్రాల్లో నటించిన మరో ప్రసిద్ధ నటి జమున.

వివరాల్లోకి వెలితే అవి జమున సినీరంగప్రవేశం కాని రోజులు. సావిత్రిగారు ఓ సినిమా షూటింగ్ నిమిత్తం జమున గారి ఊరెళ్లారట. అక్కడి వసతులు సరిగా లేవని సావిత్రిగారికి జమునగారి ఇంట్లో విడిది ఏర్పాటు చేసారట. అప్పుడే సావిత్రిగారిని జమున మొదటిసారి చూసిందట. కట్ చేస్తే మరో ఐదేళ్ల తర్వాత జమున సినీరంగ ఫ్రవేశం జరిగింది. ఓ సినిమాలో చిన్న పాత్ర చేసిన జమునని చూసిన సావిత్రి వారింటి కారు పంపించి వెంటనే తీసుకురమ్మని డ్రైవరుకు చెప్పిందట. ఆ తర్వాత వారిని గుర్తుంచుకొని మరీ అథితి సర్కారాలు చేసిందట. అంత గొప్పనటీమణి ఏదో రెండు రోజులు ఇంట్లో వుండి, ఐదేళ్శ తర్వాత చూసి గుర్తుపట్టడమే కాకుండా తమ మీది చూపిన ప్రేమాభిమానాలకు పొంగిపోయానని చెప్పింది.

డబ్బు వున్నప్పుడే కాదు చివరి రోజుల్లో ఉన్న ఆస్తినంతా పోగొట్టుకున్నా తనదగ్గర పనిచేసిన డ్రైవర్ చనిపోవడంతో ఆమె భార్య తమ కూతురి పెళ్లికి సాయం చెయ్యమని అడగ్గా వెంటనే పాతిక వేల రూపాయల ధర పలికే చీరను 5,000 లకు అమ్మి ఆమెకు ఇచ్చిందట. అంత గొప్ప మహా మనిషి కాబట్టే ఆమెనింకా ప్రజలు తలచుకొంటున్నారు. ఇవి ఆమె మంచి తనాన్ని చాటడానికి ఓ మచ్చుతునక మాత్రమే..!!

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu