మాధవన్‌కు అదిరిపోయే వెల్‌కం చెప్పిన ‘సవ్యసాచి’

By Bojja Kumar

నాగ చైతన్య హీరోగా చందూ మొండేటి దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం 'సవ్యసాచి'. ఈ చిత్రంలో సౌత్ యాక్టర్ మాధవన్ కీలకమైన పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇంతకు ముందు మాధవన్ మణిరత్నం 'సఖి', గౌతమ్ మీనన్ 'చెలి' చిత్రాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. అయితే ఆ చిత్రాలు తమిళంలో తెరకెక్కి తెలుగులో అనువాదమైన చిత్రాలు. మాధవన్ నటిస్తున్న తొలి స్ట్రైట్ మూవీ 'సవ్యసాచి'.

పలు బాలీవుడ్ చిత్రాల్లో నటించడం ద్వారా మాధవన్ నటుడిగా జాతీయ స్థాయిలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అలాంటి నటుడిని దర్శకుడు చందూ మొండేటి తొలిసారిగా టాలీవుడ్లోకి తీసుకొచ్చారు. టాలీవుడ్లోకి మాధవన్ ఎంట్రీ ఇస్తున్న సందర్భంగా అతడికి వార్మ్ వెల్ కం చెబుతూ చిత్ర బృందం ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా... ఈ చిత్రానికి సంబంధించి మాధవన్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది.

Savyasachi teams warm welcome to Madhavan

"తన రెండు చేతులను సమర్ధవంతంగా వినియోగించగల అర్జునుడిని "సవ్యసాచి" అంటారు. నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో మాధవన్, భూమికలు ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు.

కీరవాణి ఈ చిత్రానికి సంగీతం అందించడంతోపాటు నేపధ్య సంగీతం సమకూరుస్తున్నారు. జూన్ 14న సవ్యసాచిని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. నాగచైతన్య, నిధి అగర్వాల్, ఆర్.మాధవన్, భూమిక చావ్లా, రావు రమేష్, వెన్నెల కిశోర్, సత్య, తాగుబోతు రమేష్ తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎం.కీరవాణి, సినిమాటోగ్రఫీ: యువరాజ్, కళ: రామకృష్ణ, ఎడిటర్: కోటగిరి వెంకటేశ్వరరావు, ఫైట్స్: రామ్ - లక్ష్మణ్, కో-డైరెక్టర్: చలసాని రామారావు, సి.ఈ.ఓ: చిరంజీవి(చెర్రీ), లైన్ ప్రొడ్యూసర్: పి.టి.గిరిధర్, నిర్మాతలు: వై.నవీన్, వై.రవిశంకర్, మోహన్ (సివిఎం), కథ-మాటలు-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: చందు మొండేటి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X