»   » పెళ్లి చేసుకున్న మాజీ మిస్ ఇండియా

పెళ్లి చేసుకున్న మాజీ మిస్ ఇండియా

Subscribe to Filmibeat Telugu

ముంబై: మాజీ మిస్ ఇండియా, బాలీవుడ్ నటి సయాలీ భగత్ డిసెంబర్ 10న ముంబైలోని జుహు హోటల్‌లో ఢిల్లీకి చెందిన వ్యాపారవేత్త నవ్‌నీత్ ప్రతాప్ సింగ్‌ను వివాహం చేసుకుంది. కాగా పలువురు బాలీవుడ్‌ నటుల వివాహాలు ఈ వివాహాల సీజన్‌లోనే జరుగనున్నాయి. అయితే ఈ వివాహాల ఉత్సవాలను కథానాయిక సయాలీ భగత్ తన వివాహంతో ప్రారంభించినట్లయింది. చివరిసారిగా వహ్ అజ్నాబి సినిమాలో సయాలీ భగత్ కనిపించింది.

వివాహ సమయంలో సయాలీ భగత్ అందంగా ముస్తాబైంది. ప్రముఖ డిజైనర్ తరుణ్ తాహిలైనీ రూపొందించిన మెరుస్తున్న దుస్తుల్లో చాలా అందంగా కనిపించింది. చాలా మంది కథానాయికల లాగా కాకుండా సయాలీ భగత్ కుటుంబ సభ్యులు కుదుర్చిన వివాహానికి అంగీకరించింది. నవ్‌నీత్ ప్రతాప్ సింగ్ తనకు పర్ఫెక్ట్ అని సయాలీ నిర్ణయించుకుంది.

Sayali Bhagat Enters Wedlock

సింపుల్‌గా జరుపుకున్న వివాహా వేడుకకు నూతన దంపతుల కుటుంబ సభ్యులు హాజరయ్యారు. తన వివాహంపై సయాలీ భగత్ మాట్లాడుతూ.. తమ ఇరు కుటుంబాలు నిర్ణయించడంతో వివాహం ఎక్కువ సమయం తీసుకోకుండా తొందరగానే జరిగిపోయిందని తెలిపింది. దీంతో తాము డేటింగ్ కంటే ముందే పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందని సయాలీ భగత్ పేర్కొంది.

మిస్ ఇండియా అవార్డు అందుకున్న సయాలీ భగత్ తొందరలోనే బాలీవుడ్ పరిశ్రమలో ప్రవేశించింది. బాలీవుడ్‌లో ది ట్రైన్: సమ్ లైన్స్ షుడ్ నెవర్ బి క్రాస్డ్ చిత్రం ద్వారా పరిచయమైంది సయాలీ. ఈ చిత్రంలో ఇమ్రాన్ హస్మీ, గీతా బస్రాలు నటించారు. 2007, జులై 8న ఈ చిత్రం విడుదలైంది. సయాలీ భగత్ టాలీవుడ్ చిత్రాల్లోనూ నటించింది. అల్లరి నరేష్ సరసన బ్లేడ్ బాబ్జీ చిత్రంలో కథానాయికగా నటించింది. ఇంకోసారి అనే మరో చిత్రంలోనూ సయాలీ భగత్ నటించింది. సయాలీ భగత్, నవ్‌నీత్ ప్రతాప్ సింగ్‌లకు వన్ ఇండియా శుభాకాంక్షలు తెలుపుతూ.. వారి వివాహ జీవితం సంతోషంగా కొనసాగాలని కోరుకుంటోంది.

English summary

 Sayali Bhagat, ex-Miss-India turned actress got married to Navneet Pratap Singh, a Delhi based entrepreneur on December 10 at a Juhu Hotel in Mumbai.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu