»   » అఖిల్ దెబ్బకి టాలీవుడ్ నుండి ఔట్...మళ్లీ అక్కడ తేలింది!(ఫస్ట్ లుక్)

అఖిల్ దెబ్బకి టాలీవుడ్ నుండి ఔట్...మళ్లీ అక్కడ తేలింది!(ఫస్ట్ లుక్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: అక్కినేని వారసుడు అఖిల్ ను హీరోగా పరిచయం చేస్తూ వివి వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కిన 'అఖిల్' చిత్రం ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. ఈ సినిమా దెబ్బకి నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోయారు. సినిమా రిలీజ్ ముందు ఎంత హైప్ వచ్చిందో... రిలీజ్ తర్వాత అంత పాతాలానికి పడిపోయింది.

ఇదే సినిమా ద్వారా హిందీ నటుడు దిలీప్‌కుమార్‌ మనవరాలే సాయేషా సైగల్ తెలుగులో హీరోయిన్ గా పరిచయం అయింది. ఈ సినిమా రిలీజ్ ముందు హైప్ చూసి సాయేషా కూడా తెగ సంబర పడిపోయింది. తన తొలి సినిమా భారీ హిట్టవుతుందనే నమ్మకం పెట్టుకుంది. కానీ ఆమె ఆశలు అడియాశలైపోయాయి.

sayesha

'అఖిల్' దెబ్బకి అమ్ముడు టాలీవుడ్ నుండి ఔట్ కాక తప్పలేదు. ఆ సినిమా తర్వాత మళ్లీ ఎక్కడా సాయేషా పేరు వినిపించలేదు. మళ్లీ ఇన్నాళ్లకు అమ్ముడు హిందీలో తేలింది. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న 'శివాయ్'తో సాయేషా హీరోయిన్ గా బాలీవుడ్ కు పరిచయం కాబోతోంది.

తాజాగా సాయేషా లుక్ కూడా విడుదల చేసారు. ఫస్ట్ లుక్ ఆకట్టుకునే విధంగా ఉంది. బాలీవుడ్లో అమ్మడుకి ఇదే తొలి సినిమా. ఈ సినిమాపై సాయేషా చాలా ఆశలు పెట్టుకుంది. మరి ఆమెకు అదృష్టం ఏ మేరకు కలిసొస్తుందో తెలియాలంటే దీపావళి వరకు ఆగాల్సిందే.

English summary
Ajay Devgn, who is making a comeback as a director with Shivaay, has unveiled the first look of his film’s lead actress Sayyeshaa, the grandniece of veteran actress Saira Banu, on Twitter.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu