»   » రజినీకాంత్ పై దాడి మొదలైందా: స్కూలుకు తాళం పెట్టారు

రజినీకాంత్ పై దాడి మొదలైందా: స్కూలుకు తాళం పెట్టారు

Posted By:
Subscribe to Filmibeat Telugu

దక్షిణాది సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వచ్చే ప్రయత్నాల్లో ఉండగానే ఇక ఆయన చుట్టూ సమస్యలు ముసురు కోవటం మొదలయ్యింది. ఇప్పుడు వస్తున్న విమర్శలు కొత్తవేం కాదు గానీ గతం లో ఉన్న సమస్య్లే మరింత ముదురుతున్నాయి. నిన్న తాజాగా కుటుంబానికి ఎదురుదెబ్బ తగిలింది.

రజనీ సతీమణి లత

రజనీ సతీమణి లత

స్థానిక గిండిలో రజనీ సతీమణి లత నిర్వహిస్తున్న ఆశ్రమ్‌ విద్యాలయ భవనానికి రూ.2 కోట్ల అద్దె బకాయి పడడంతో బుధవారం సీజ్‌ చేశారు. దీనితో ఈ పాఠశాలలో చదువుతున్న 300 మంది విద్యార్థులను వేళచ్చేరిలోని ఐసీఏసీ పాఠశాల(ఆశ్రమ్‌ మెట్రిక్యులేషన్‌ పాఠశాల అనుబంధ సంస్థ)కు తరలించినట్టు సమాచారం.

2009 నుంచి అద్డె బకాయి

2009 నుంచి అద్డె బకాయి

కాగా, లతా రజనీకాంత్‌ నిర్వహిస్తున్న ఆశ్రమ విద్యాలయానికి ఆ భవనం యజమాని వెంకటేశ్వర్లు మంగళవారం రాత్రే తాళం వేశారు. ఈ పాఠశాల భవనానికి 2009 నుంచి అద్డె బకాయి ఉన్నట్టు తెలిసింది. దీనికి సంబంధించి ఆ భవనం యజమాని వెంకటేశ్వర్లు మద్రాస్‌ హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు.

బకాయి పడిన అద్దె రూ.11 కోట్లు

బకాయి పడిన అద్దె రూ.11 కోట్లు

దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం గత జూన్‌లో ఇరువర్గాలను చర్చలకు ఆహ్వానించింది. అప్పుడు బకాయి పడిన అద్దె రూ.11 కోట్లు చెల్లించాలంటూ వెంకటేశ్వర్లు డిమాండ్‌ చేశారు. అయితే అంత మొత్తాన్ని చెల్లించలేమని చెప్పిన లతారజనీకాంత్‌ రూ.2 కోట్లు ఇచ్చేందుకు సమ్మతించినట్టు తెలిసింది. న్యాయస్థానంలో అంగీకరించిన హామీని లతారజనీకాంత్‌ ఉల్లంఘించినందు వల్ల ఆ పాఠశాలకు తాళం వేసినట్టు వెంకటేశ్వర్లు తరపున ప్రకటించారు.

వివరణ

వివరణ

పాఠశాలకు తాళం వేయడంపై స్పందించిన ఆశ్రమ్‌ మెట్రిక్యులేషన్‌ మహోన్నత పాఠశాల యాజమాన్యం దీనిపై వివరణ తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. తమకు విపరీతంగా పెంచిన అద్దెలతో అసాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, స్థలం యజమాని నుంచి అనేక ఇబ్బందులు ఎదురవడంతో ప్రస్తుతం స్థలాన్ని ఖాళీ చేయాలని నిర్ణయించినట్టు యాజమాన్యం తెలిపింది.

తప్పుడు వార్తలు ప్రచారం చేయరాదని

తప్పుడు వార్తలు ప్రచారం చేయరాదని

పైగా ఈ సమస్యను ముగించే దిశగా చర్చలు జరుగుతున్నాయని, ప్రసార మాధ్యమాలు వాస్తవాలు తెలుసుకుని ఎలాంటి తప్పుడు వార్తలు ప్రచారం చేయరాదని విజ్ఞప్తి చేసింది. పాఠశాల స్థలం యజమాని పెట్టిన వేధింపుల కారణంగా మానసిక ఇబ్బందులకు గురైన విద్యార్థులు, తల్లిదండ్రులు, టీచర్లు, సిబ్బంది తరపున చట్ట ప్రకారం చర్యలు కోరుతూ పరువునష్టం దావా వేయనున్నట్టు పాఠశాల యాజమాన్యం తన ప్రకటనలో తెలిపింది

English summary
A school run by superstar Rajinikanth's wife Latha Rajinikanth in Chennai was locked up last night by the building's landlord, who alleges that he has not received rent.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu