»   »  స్క్రీన్ రైటర్స్ కి 'గీతా ఆర్ట్స్' గోల్డెన్ ఆఫర్

స్క్రీన్ రైటర్స్ కి 'గీతా ఆర్ట్స్' గోల్డెన్ ఆఫర్

Posted By:
Subscribe to Filmibeat Telugu
Nagababu
కథలు రాసుకుని ఎవరిని కలవాలో అర్ధం కాని స్ధితిలో ఉన్న రైటర్స్, ఇంకా పెద్ద బ్యానర్స్ ద్వారా బ్రేక్ రాలేదని బాధ పడేవాళ్ళకు గీతా ఆర్ట్స్ ఆహ్వానం పలుకుతోంది. గతంలో ఎన్నో సూపర్ హిట్ ఫిలిమ్స్ ని అందించిన వీరు ఇప్పుడు కొత్త ఆలోచనలు తో వచ్చేవారికి అవకాశాలు అందించటానికి రెడీ అవుతోంది. కాబట్టి మీ దగ్గర మంచి కథ ఉందని భావిస్తే ...వెంటనే ఈ క్రింద ఎడ్రస్ కి పంపండి. అయితే కథ ఒరిజల్ దై ఉండాలి. స్మాల్ బడ్జెట్ సినిమాకి పనికొచ్చేదైతే మేలనేది వారి భావన.

ఇక ఆసక్తి ఉన్న రచయితలు తమ CV తో పాటు స్టోరీ సినాప్సిస్ గానీ ,ట్రీట్ మెంట్ వెర్షన్ గానీ వీరికి సబ్మెట్ చేయాలని కోరుతున్నారు. రైటర్స్ అసోసియేషన్ లో రిజస్టర్ చేయించి పంపిటం మంచిదనేది వారి సూచన. ఇక ఈ స్క్రిప్టులలో ఫ్రిపెరెన్స్ ఫిల్మ్ స్కూల్ నుంచి వచ్చిన వారు,పరిశ్రమలో ఎక్సరీరియన్స్ ఉన్నవారికి,సాహిత్యం బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన వారికి ఇవ్వటం జరుగుతుందని వారు చెప్తున్నారు. ఆసక్తి ఉంటే పంపవల్సిన ఇ మెయిల్ ఐడి ని 'అల్లు శిరీష్' కి storydept@geethaarts.com పంపాలి.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X