»   » మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ ఆగిందా? కారణమేంటి?

మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’ షూటింగ్ ఆగిందా? కారణమేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: సూప‌ర్ స్టార్ మ‌హేష్ న‌టిస్తున్న తాజా చిత్రం బ్ర‌హ్మోత్స‌వం షూటింగ్ ఆగిపోయినపట్లు ఫిల్మ్ నగర్లో ప్రచారం జరుగుతోంది. షూటింగ్ స్పాట్ లో డైరెక్ట‌ర్ శ్రీకాంత్ అడ్డాల స్ర్కిప్ట్ లో మార్పులు చేయడం గమనించిన మ‌హేష్ షూటింగ్ స్పాట్ లో స్ర్కిప్ట్ వ‌ర్క్ చేయ‌డం క‌రెక్ట్ కాదు. కావాల‌సినంత టైం తీసుకుని ప‌క్కాగా స్ర్కిప్ట్ రెడీ అయిన త‌ర్వాతే షూటింగ్ చేద్దామ‌ని చెప్పాడ‌ట‌.

ప్రస్తుతం శ్రీకాంత్ అడ్డాల స్క్రిప్టులో మార్పులు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన అపీషియల్ సమాచారం అందాల్సి ఉంది. శ్రీమంతుడు విజయం తర్వాత మహేష్ బాబు ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని శ్రీకాంత్ అడ్డాల ఈ నిర్ణయం తీసుకున్నట్లు టాక్.


Script Issues for Mahesh's 'Brahmotasavam'?

మహేష్ బాబు హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘బ్రహ్మోత్సవం'. తెలుగు, త‌మిళ్ లో పి.వి.పి సంస్థ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్ తో రూపొందిస్తుంది. ఈ చిత్రంలో మ‌హేష్ స‌ర‌స‌న స‌మంత‌, కాజ‌ల్, ప్ర‌ణీత న‌టిస్తున్నారు. బంధాలు..అనుబంధాలు నేప‌థ్యంతో విజ‌య‌వాడ బ్యాక్ డ్రాప్ తో రూపొందే ఈ బ్ర‌హ్మోత్స‌వం సినిమా తిరుప‌తిలో జ‌రిగే బ్ర‌హ్మోత్స‌వం స‌న్నివేశంతో శుభం కార్డ్ ప‌డుతుంద‌ని తెలుస్తోంది. పూర్తి స్థాయిలో ఫ్యామిలీ ఎంటర్టెనర్ గా ఈ సినిమా ప్రేక్షకులను అలరించబోతోంది.


ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ఏప్రిల్ 8న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. సమ్మర్ సీజన్లో మహేష్ బాబు సినిమా వచ్చి దాదాపు పదేళ్లయింది. 2006లో ఆయన నటించిన ‘పోకిరి' సినిమా విడుదలై భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అప్పట్లో ఆ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. ఆ త‌రువాత మ‌ళ్లీ వేస‌వి సీజ‌న్‌లో మహేష్ సినిమాల‌ేవీ విడుదల కాలేదు.


Script Issues for Mahesh's 'Brahmotasavam'?

దశాబ్దం గ్యాప్ తర్వాత మహేష్ బాబు నటించిన 'బ్ర‌హ్మోత్స‌వం' 'పోకిరి' రిలీజైన ఏప్రిల్ నెల‌లోనే తీసుకువ‌చ్చే దిశ‌గా ప్ర‌య‌త్నం చేస్తున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ స్వరాలందిస్తున్నారు. గతంలో మహేష్ బాబు - శ్రీకాంత్ అడ్డాల కాంబినేషన్ లో వచ్చిన ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు' సినిమా కూడా కుటుంబ భావోద్వేగాల నేపధ్యంలో సిద్దం అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అదే సెంటిమెంట్ ని ఈ సారి కూడా రిపీట్ చేయనున్నారు.


బ్రహ్మోత్సవం చిత్రాన్ని పి.వి.పి సినిమా పతాకంపై పెరల్‌ వి.పొట్లూరి, పరమ్‌ వి.పొట్లూరి నిర్మిస్తున్నారు. సత్యరాజ్‌, జయసుధ, రావు రమేష్‌, ప్రకాష్‌రాజ్‌, తనికెళ్ల భరణి తదితరులు నటిస్తున్నారు. ఛాయాగ్రహణం: ఆర్‌.రత్నవేలు, సంగీతం: మిక్కీ జె.మేయర్‌, కూర్పు: శ్రీకర ప్రసాద్‌, కళ: తోట తరణి.

English summary
Film Nagar source said that, The shooting of Superstar Mahesh Babu’s family entertainer Brahmotsavam has been halted because of Script Issues.
Please Wait while comments are loading...