»   » తన ‘స్క్రిప్ట్’ కాపీ కొట్టారంటూ కోర్టుకు...

తన ‘స్క్రిప్ట్’ కాపీ కొట్టారంటూ కోర్టుకు...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: మరో కాపీ వివాదం భారీ బడ్జెట్ సినిమాకు తగులుకుంది. గతంలో తాను ఇచ్చిన స్క్రిప్ట్ ఆధారంగా 'క్రిష్ 3' నిర్మించారని, తనకు ఎలాంటి పారితోషికం ఇవ్వలేదని, సినిమా టైటిల్స్‌లో తన పేరు కూడా వేయలేదని మధ్యప్రదేశ్‌కు చెందిన ఉదయ్‌సింగ్ రాజ్‌పుట్ అనే రచయిత ముంబై హైకోర్టును ఆశ్రయించాడు.

కాపీ రైట్ చట్టాన్ని ఉల్లంఘించినందుకు సినిమా విడుదలను నిలిపివేయాలని ఆయన పిటిషన్ దాఖలు చేసినప్పటికీ కోర్టు అందుకు అంగీకరించలేదు. 2008లో 'క్రిష్ 2' పేరిట తాను రాసిన స్క్రిప్ట్‌ను సినీ రచయితల సంఘంలో రిజిస్టర్ చేయించానని, దాని ప్రతిని నిర్మాత, దర్శకుడు రాకేష్ రోషన్‌కు పంపానని ఉదయ్‌సింగ్ చెబుతున్నారు.

Script Writer takes Krrish 3 to court for rights violation

'క్రిష్ 3' సినిమాకు తన స్క్రిప్ట్‌ను వాడుకోవడమే గాక, రాబిన్ భట్ అనే వ్యక్తికి పారితోషికం చెల్లించారని ఆయన పిటిషన్‌లో పేర్కొన్నారు. తనకు నష్టపరిహారంగా రెండు కోట్ల రూపాయలు ఇవ్వాలని, కేసు విచారణ ప్రారంభించగానే తాత్కాలికంగా కొంత మొత్తం చెల్లించేలా ఆదేశించాలని ఆయన కోరారు.

అయితే, రాకేష్ రోషన్ తరఫున న్యాయవాదులు కూడా కోర్టుకు హాజరై సినిమా విడుదలకు ఆటంకం లేకుండా చూడాలని అభ్యర్థించారు. సినిమాను నిలిపివేసే విషయంలో కోర్టు నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేనందున, నవంబర్ 1న దేశవ్యాప్తంగా 'క్రిష్ 3'ని విడుదల చేసారు. అయితే సినిమా ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. కానీ పండగ ప్రబావంతో కలెక్షన్స్ బాగానే ఉన్నాయి.

English summary
A nondescript scriptwriter from Madhya Pradesh, Uday Singh Rajput, has dragged the makers of Bollywood film Krrish 3 to the Bombay high court over copyright violation. Rajput claims that he wrote the script for the movie but wasn’t given credit for it. The makers of the film have also moved the court asking that Rajput’s plea be not entertained and the release of the film not be disturbed.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu