»   » రామ్ గోపాల్ వర్మ అన్యాయం చేసాడంటూ కోర్టుకెక్కిన రచయిత!

రామ్ గోపాల్ వర్మ అన్యాయం చేసాడంటూ కోర్టుకెక్కిన రచయిత!

Posted By:
Subscribe to Filmibeat Telugu

ముంబై: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరో వివాదంలో ఇరుక్కున్నారు. నీలేష్ గిర్కర్ అనే ఓ స్క్రీన్ ప్లే రచయిత రామ్ గోపాల్ వర్మ మీద బాంబే హై కోర్టులో కేసు వేసాడు.వర్మ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న 'సర్కార్-3' చిత్రానికి సంబంధించిన అతడు కేసు వేసాడు.

అమితాబ్ బచ్చన్ ప్రధాన పాత్రలో రామ్ గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న 'సర్కార్-3' స్టోరీ తానే రాసానని, అయితే వర్మ తనకు ఫిల్మ్ టైటిల్స్ లో క్రిడెట్ ఇవ్వడం లేదని నీలేష్ ఆరోపించారు. దీంతో పాటు తనకు ఇవ్వాల్సిన డబ్బు కూడాచెల్లించలేదని తెలిపారు.

 కోర్టు తీర్పు

కోర్టు తీర్పు

నిలేష్ పిటీషన్ స్వీకరించిన కోర్టు.... సినిమా విడుదల ముందే అతడికి ప్రత్యేకంగా షో వేసి చూపించాలని, దీంతో పాటు రూ. 6.20 లక్షలు కోర్టులో డిపాజిట్ చేయాలని సూచించింది.

సర్కార్ 3

సర్కార్ 3

ఇటీవలే సర్కార్ ఫస్ట్ లుక్ రిలీజైంది. యాంగ్రీ లుక్ తో అమితాబ్ లుక్ అద్భుతంగా ఉంది అంటున్నారు అభిమానులు. గాడ్‌ ఫాదర్‌ సుభాష్‌ సర్కార్‌ నాగ్రే పాత్రలో అమితాబ్‌ నటించిన ఈ చిత్రం సర్కార్ సిరీస్‌లో 3వ భాగం కావడం విశేషం. ఇదివరకు వచ్చిన రెండు పార్ట్‌లు సూపర్ సక్సెస్ సాధించడంతో.. మూడో భాగాన్ని మరింత అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు దర్శకులు రామ్‌గోపాల్ వర్మ.

ఏప్రిల్ 7

ఏప్రిల్ 7

అమితాబ్ తో పాటు మనోజ్‌ బాజ్‌పాయ్‌, యామీ గౌతమ్‌, జాకీ ష్రాఫ్‌ ఈ చ ిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రాన్ని పరాగ్‌ సాంఘ్వి, రాజు చడ్డా, సునీల్‌ ఎ. లుల్లా తో కలిసి అమితాబ్‌ బచ్చన్ నిర్మిస్తున్నారు. రామ్‌గోపాల్‌వర్మ పుట్టినరోజును పురస్కరించుకుని ఏప్రిల్‌ 7న ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అయితే తన 25ఏళ్ల సినీ కెరీర్‌లో ఇలా బర్త్‌డే రోజున వర్మ తొలిసారిగా తాను డైరక్ట్ చేసిన సినిమాను విడుదల చేస్తుండటం విశేషం.

ఏడ్చేసిన వర్మ

ఏడ్చేసిన వర్మ

సర్కార్-3 ప్రమోషన్లో భాగంగా అమితాబ్ ఇటీవల సుభాష్‌ ఘాయ్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సుభాష్ ఘాయ్ అడిగిన ప్రశ్నలు, దానికి అమితాబ్ సమాధానం చూసి ఎమోషన్ అయ్యారట వర్మ. అమితాబ్ త‌న గురించి అంత గొప్పగా చెప్పడంతో వర్మ ఎమోషన్ అయ్యారు. ఏడ్చేసారు. బిగ్ బీకి తనపై ఉన్న ఆ నమ్మకాన్ని జీవితాంతం నిలబెట్టుకోవాలని అనుకుంటున్న‌ట్లు వర్మ పేర్కొన్నారు.

ఇంతకీ వర్మ గురించి బిగ్ బి ఏం చెప్పారు?

ఇంతకీ వర్మ గురించి బిగ్ బి ఏం చెప్పారు?

వర్మ స్థిరత్వంలేని దర్శకుడు అనే ప్రశ్నకు అమితాబ్‌ స్పందిస్తూ... స్థిరత్వం లేకపోవడమనేది ఓ విచిత్రమే. ఒకేలా ఉండే నేపథ్యాలు, సినిమాలు ప్రేక్ష‌కుల‌కి బోర్‌ కొట్టిస్తాయి. ఎప్పుడూ నల్లరంగు దుస్తులే వేసుకున్నప్పుడు వేరే రంగులోని అంతాన్ని గుర్తించడంకష్టం. ఒకే రంగు దుస్తుల్లో ఉండడం చాలా మందికి అసౌకర్యంగా అనిపిస్తుంది. అలాగే రాంగోపాల్‌ వర్మది విరామం లేకుండా సృజనాత్మకంగా ఆలోచించే తత్వం. ఎప్పుడూ తన ఆలోచనల నుంచి ఏదో ఒక కొత్తదనం రావాలనుకునే వ్యక్తి వ‌ర్మ అంటూ.... అమితాబ్ గొప్పగా చెప్పారు.

English summary
Controversies favorite child Ram Gopal Varma has landed himself in yet another controversy. A screenwriter named Nilesh Girkar had approached the Bombay High Court alleging that the story of Sarkar 3, RGV’s upcoming movie featuring Amitabh Bachchan, was penned by him and that RGV didn’t give him due credit in the film’s titles.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu