»   » అక్కడెక్కడో టేప్ పెట్టాడు... మరి ఇప్పుడో..!? ఫ్యాషన్ డిజైనర్ మరో పోస్టర్, సాంగ్ రేపే

అక్కడెక్కడో టేప్ పెట్టాడు... మరి ఇప్పుడో..!? ఫ్యాషన్ డిజైనర్ మరో పోస్టర్, సాంగ్ రేపే

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ దర్శకుడు వంశీ సినిమాల్లోని గోదావరి అందాలు, ఆ గోదావరి అందాలతో పోటీ పడే హీరోయిన్ల అందాలు, సంభాషణలు, సంగీతం, చిత్రీకరణ ఇలా అన్నీ ప్రత్యేకంగా ఉంటాయి. వంశీ దర్శకత్వంలో దాదాపు 30 ఏళ్ల క్రితం వచ్చిన 'లేడీస్ టైలర్' తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ గుర్తుండి పోయే సినిమాగా నిలిచి పోయింది.

సన్ ఆఫ్ లేడీస్ టైలర్

సన్ ఆఫ్ లేడీస్ టైలర్

అప్పటి పరిస్థితులను ఫోకస్ చేస్తూ ఆ సినిమా ఉంటే... ఇప్పటి లేటెస్ట్ ట్రెండుకు తగిన విధంగా 'ఫ్యాషన్ డిజైనర్' పేరుతో తాజాగా ఓ సినిమా మొదలు పెట్టారు వంశీ. సన్ ఆఫ్ లేడీస్ టైలర్ అనేది సబ్ కాప్షన్. రాజేంద్రప్రసాద్‌ హీరోగా నటించిన ఆ చిత్రాన్ని ఎప్పటికీ మర్చిపోలేరు తెలుగు ప్రేక్షకులు.

లేడీస్‌ టైలర్‌

లేడీస్‌ టైలర్‌

ఆ పాత మధురం 'లేడీస్‌ టైలర్‌' సినిమాకి సీక్వెల్‌ని మధుర శ్రీధర్‌ రెడ్డి నిర్మిస్తున్న సంగతి తెల్సిందే... 'లేడీస్‌ టైలర్‌' చిత్రాన్ని తెలుగు ప్రేక్షకులకు అందించిన లెజెండరీ డైరెక్టర్‌ వంశీనే, ఈ సీక్వెల్‌కి కూడా దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్‌ అశ్విన్‌, అనీషా ఆంబ్రోస్‌, మనాలి రాథోడ్‌, మానస తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

అనేక విమర్శలు

అనేక విమర్శలు

ఇటీవల చిత్ర ప్రీలుక్ ఒకటి విడుదల చేసి అనేక విమర్శలు అందుకున్న వంశీ ఆ తర్వాత కొంత పద్దతిగా పోస్టర్స్ ని రిలీజ్ చేస్తూ వస్తున్నాడు. ఏప్రిల్ 14 సాయంత్రం ఫస్ట్ సింగిల్ సాంగ్ విడుదల కానుందనే విషయాన్ని పోస్టర్ ద్వారా రివీల్ చేసిన వంశీ, తాజాగా మరో పోస్టర్ తో సెకండ్ సింగిల్ సాంగ్ రిలీజ్ డేట్ చెప్పేశాడు.

ఏప్రిల్ 20

ఏప్రిల్ 20 (గురువారం) సాయంత్రం 4గం.లకు ఆ సాంగ్ విడుదల చేయనున్నారు. ఇప్పటి ట్రెండ్ నే ఫాలో అవుతూ తన సినిమాను ప్రమోట్ చేసుకుంటున్న వంశీ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయనున్నాడు. మధుర శ్రీధర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో అనీషా అంబ్రోస్,మనాలి రాథోడ్ , ఈషా, మానస కథానాయికలుగా కనిపించనున్నారు. మణిశర్మ సంగీతం ఈ మూవీని తారా స్ఠాయికి తీసుకెళ్ళడం ఖాయం అంటున్నారు.

English summary
"Second single from #FashionDesignerSonOfLadiesTailor will be released on Thursday 20th April 4 PM!" Tweets FashionDesigner Son Of LadiesTailor Team
Please Wait while comments are loading...
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu