»   » సుమంత్ అన్నపూర్ణ స్టూడియో (రేర్‌ ఫోటో)

సుమంత్ అన్నపూర్ణ స్టూడియో (రేర్‌ ఫోటో)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్ : హీరో సుమంత్ తన ట్విట్టర్లో ఓ అరుదైన ఫోటోను పోస్టు చేసాడు. అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి పునాదిరాయి వేసిన సందర్భంగా జరిగిన పూజా కార్యక్రమంలో తన అమ్మమ్మ అన్నపూర్ణమ్మతో కలిసి దిగిన ఫోటోను ట్విట్టర్లో షేర్ చేసాడు. ఆగస్టు 13, 1975లో అన్నపూర్ణ స్టూడియో నిర్మాణానికి పునాదిరాయి వేసారు.

సుమంత్ సినిమాల విషయానికొస్తే...ప్రస్తుతం సుమంత్ 'ఏమో గుర్రం ఎగరవచ్చు' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా బ్యాంకాక్(థాయ్‌లాండ్) చెందిన సవికా నటిస్తోంది. ఇప్పటికే తమిళ సినిమా 'మార్కండేయన్' ద్వారా ఇండియన్ సినిమా రంగంలోకి అడుగు పెట్టిన సవికా చైయదేచ్ నిక్ నేమ్ పింకీ. ఇక్కడ అంతా ఆమెను పింకీ సవికా అని పిలుస్తున్నారు.

<blockquote class="twitter-tweet blockquote"><p>Missed that?! Aug13th-the anniversary of our Mothership <a href="https://twitter.com/search?q=%23AnnapurnaStudios&src=hash">#AnnapurnaStudios</a>. Ammamma helping me lay the foundation <a href="http://t.co/FCfUuu6IeS">pic.twitter.com/FCfUuu6IeS</a></p>— Sumanth (@iSumanth) <a href="https://twitter.com/iSumanth/statuses/368256927341359104">August 16, 2013</a></blockquote> <script async src="//platform.twitter.com/widgets.js" charset="utf-8"></script>

'ఏమో గుర్రం ఎగరవచ్చు' చిత్రానికి చంద్రసిద్ధార్థ దర్శకత్వం వహిస్తున్నారు. రచయిత, దర్శకుడు మదన్ 'ఆ నలుగురు ఫిలిమ్స్' పతాకంపై ఈ సినిమా నిర్మించబోతున్నారు. రాజమౌళి 'మర్యాద రామన్న'కు కథ అందించి, 'ఈగ'కు స్క్రిప్టు రైటర్ గా పనిచేసిన కాంచి ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు.

గతంలో సుమంత్-చంద్రసిద్ధార్థ కాంబినేషన్లో 'మధుమాసం' సినిమా వచ్చింది. ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం సంగీత చర్చలు సాగుతున్నాయి. చైతన్య ప్రసాద్ సాహిత్యం అందుస్తున్నారు. సగం ఇండియాలోనూ, సగం అమెరికాలోనూ కథ జరుగుతుంది. అందుకు తగిన విధంగా సినిమాను ఇక్కడ సగం, అక్కడ సగం చిత్రీకరిస్తున్నారు. ఈచిత్రానికి కథ-మాటలు : ఎస్.ఎస్. కాంచి, కెమెరా : చంద్రమౌళి, ఆర్ట్స్ : నాగేంద్రబాబు, పాటలు : చైతన్య ప్రసాద్, సంగీతం : ఎంఎం. కీరవాణి, స్ర్కీన్ ప్లే-నిర్మాత : మదన్, సమర్పణ : నీల శంకర్, దర్శకత్వం : చంద్ర సిద్ధార్థ.

English summary
Annapurna Studios foundation stone laying ceremony pic was shared by actor Sumanth. "Missed that?! Aug13th-the anniversary of our Mothership #AnnapurnaStudios. Ammamma helping me lay the foundation" Sumanth tweeted.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu