»   » జైబోలో తెలంగాణపై హెచ్చార్సీలో ఫిర్యాదు: శాంతిభద్రతలపై ప్రశ్నించిన లాయర్లు

జైబోలో తెలంగాణపై హెచ్చార్సీలో ఫిర్యాదు: శాంతిభద్రతలపై ప్రశ్నించిన లాయర్లు

Posted By:
Subscribe to Filmibeat Telugu

ప్రముఖ నటుడు జగపతిబాబు ప్రధాన పాత్రలో నటించిన జైబోలో తెలంగాణ చిత్రం కారణంగా అంతర్గత సమస్యలు తలెత్తితే దానికి ఎవరు బాధ్యతలు వహిస్తారంటూ ఆ చిత్రాన్ని వెంటనే ఆపాలంటూ సీమాంధ్ర న్యాయవాద ఐక్య కార్యాచరణ సమితి బుధవారం ప్రశ్నించింది. సీమాంధ్ర లాయర్లు ఈ చిత్రంపై మానవహక్కుల కమిషన్‌లో ఫిర్యాదు చేశారు. జైబోలో తెలంగాణలో ఒక ప్రాంతానికి చెందిన చిత్రం కాబట్టి మరో ప్రాంతానికి చెందిన వారిని కించపరిచే వ్యాఖ్యలు ఏమైనా ఉంటే రాష్ట్రంలో అశాంతికి దారి తీస్తుందన్నారు.

అలాంటప్పుడు దానికి ఎవరూ బాధ్యత వహిస్తారని లాయర్లు ఈ సందర్భంగా అన్నారు. ఒక ప్రాంతానికి చెందిన వారిని కించపర్చే విధంగా ఉందని సెన్సారు బోర్డు ఆ చిత్రాన్ని మొదట అడ్డుకున్నదని గుర్తు చేశారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu