»   » ఆ కారణంగా అవకాశాలు చేజారాయి.. అన్నిచోట్ల ఆ సమస్య.. క్యాస్టింగ్ కౌచ్‌పై సీరత్ కపూర్

ఆ కారణంగా అవకాశాలు చేజారాయి.. అన్నిచోట్ల ఆ సమస్య.. క్యాస్టింగ్ కౌచ్‌పై సీరత్ కపూర్

Posted By:
Subscribe to Filmibeat Telugu

రన్ రాజా రన్ చిత్రంతో టాలీవుడ్‌లోకి ప్రవేశించిన ముద్దుగుమ్మ సీరత్ కపూర్ తాజాగా రవితేజ‌తో టచ్ చేసి చూడు చిత్రంలో నటిస్తున్నది. టచ్ చేసి చూడు చిత్రం ఫిబ్రవరి 2 తేదీన రిలీజ్ అవుతున్న నేపథ్యంలో సీరత్ కపూర్ ఫిల్మీబీట్‌ తెలుగుతో ముచ్చటించింది. ఈ సందర్భంగా సినీ పరిశ్రమలో ఉండే క్యాస్టింగ్ కౌచ్, బంధుప్రీతి లాంటి సమస్యలపై ఆమె తన అభిప్రాయలను వెల్లడించింది. అవి మీ కోసం..

సినిమాలు చేజారాయి..

సినిమాలు చేజారాయి..

సినీ పరిశ్రమలో బంధుప్రీతి (నెపొటిజం) లేదంటే అది హిపోక్రసి అవుతుంది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ చెప్పిన విషయంలో నిజం ఉంది. కొన్నిసార్లు వచ్చిన సినిమాలు చేజారి పోయాయి. కొన్నిసార్లు బాధ కలుగుతుంది. దాని గురించి ఆలోచించి సమయాన్ని వృథా చేసుకొను. నా ప్రయత్నాలు నేను చేశాను. ఈ రోజు నా ప్రతిభకు తగినట్టుగా నేను ఓ పొజిషన్‌లో ఉన్నాను.

 సినిమా పేర్లు చెప్పడం సరికాదు..

సినిమా పేర్లు చెప్పడం సరికాదు..

బంధుప్రీతి వల్ల నేను చేజార్చుకొన్న సినిమాలు చెప్పడం బాగుండదు. దాని వల్ల ప్రయోజనం ఉండదు. జరిగిన వాటిని తలుచుకోని బాధపడటం కంటే.. మన కోసం ఓ లక్ష్యం ఉంది అని ముందుకు పోవడమే మంచిది.

టాలీవుడ్‌లో బంధుప్రీతి

టాలీవుడ్‌లో బంధుప్రీతి

టాలీవుడ్‌లో బంధుప్రీతి ఉంటుందనే విషయం నాకు ఎక్కడ ఎదురుపడలేదు. అలాంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది అని నేను అనుకోను. బాలీవుడ్‌లో మాత్రం తన బంధువులకు అవకాశాలు కల్పించడం జరుగుతుంటుంది.

 నాకు అలా చెప్పేవాళ్లు..

నాకు అలా చెప్పేవాళ్లు..

ఆడిషన్ సమయంలో నా టాలెంట్ నచ్చి చిన్న స్మైల్ ఇచ్చేవాళ్లు. కానీ ఆ తర్వాత వాళ్లే నాకు చెప్పేవాళ్లు. కొన్ని కారణాల వల్ల మేము ఈ సినిమాలోకి తీసుకోలేకపోతున్నాం చెప్పిన సందర్భాలు ఉన్నాయి.

రవితేజ 'టచ్ చేసి చూడు' టీజర్ అదిరింది..!
 అన్ని చోట్ల క్యాస్టింగ్ కౌచ్

అన్ని చోట్ల క్యాస్టింగ్ కౌచ్

అవకాశం ఇస్తాం పడక గదిలోకి రమ్మనే సంస్కృతి (క్యాస్టింగ్ కౌచ్) అనిచోట్ల ఉంది. అన్ని పరిశ్రమల్లోనూ ఉంది. కెరీర్ ఆరంభంలోనే కాదు.. అన్ని సందర్భాల్లో అలాంటి సంఘటనలకు ఎదురుకావొచ్చు. నా కెరీర్‌లో అలాంటి సంఘటనలు ఎదురయ్యాయి.

 నా వద్ద అలాంటి ప్రస్తావన

నా వద్ద అలాంటి ప్రస్తావన

ఎవరైనా నా వద్ద అలాంటి ప్రస్తావన తెచ్చినపుడు నేను వెంటనే దానిని కట్ చేయడానికి ప్రయత్నిస్తాను. అవసరమైతే అలాంటి సినిమాలకు దూరంగా ఉంటాను. సినిమా పరిశ్రమ కాబట్టి ఆ విషయంపై స్వేచ్ఛగా ఎదురించడానికి మీడియా సపోర్ట్ ఉంది. కానీ సాఫ్ట్‌వేర్ లాంటి మిగితా పరిశ్రమల్లో ఇలాంటి అవకాశం ఉండదు.

 పరిస్థితిలో మార్పు వస్తున్నది

పరిస్థితిలో మార్పు వస్తున్నది

సినీ పరిశ్రమలో ఇలాంటి పరిస్థితిలో మార్పు వస్తున్నది. మహిళా ప్రాధాన్యం ఉన్న పద్మావతి లాంటి సినిమాలు రూపొందుతున్నాయి. పద్మావతి సినిమా కోసం అక్షయ్ కుమార్ తన చిత్రం ప్యాడ్‌మాన్‌ను వాయిదా వేసుకొన్నాడు. దీనిని బట్టి సినిమా పరిశ్రమలో ఎలాంటి మార్పులు చేసుకొంటున్నాయో అనే విషయాన్ని చెప్పవచ్చు.

 పురుషుల సహకారం కావాలి

పురుషుల సహకారం కావాలి

మహిళా సాధికారత, ఫెమినిజం లాంటి మాట్లాడటానికి బాగానే ఉంటాయి. ఇలాంటి సమస్యలకు చెక్ పెట్టడానికి పురుషుల సహకారం ఉండాలి. అప్పుడే ఏ పరిశ్రమలోనైనా క్యాస్టింగ్ కౌచ్ లాంటి సమస్యను అధిగమించవచ్చు. హాలీవుడ్ దర్శకుడు హార్వే వెయిన్‌స్టీన్ ఉదంతంతో ఇలాంటి సంఘటనలు ఇప్పుడిప్పుడే వెలుగుచూస్తున్నాయి.

 పద్మావతిపై ఆరోపణలు తప్పు

పద్మావతిపై ఆరోపణలు తప్పు

పద్మావతి సినిమా రాజపుత్రుల వంశానికి వ్యతిరేకంగా ఉంది అనే ఆరోపణలు తలెత్తాయి. కానీ నేను పద్మావతి సినిమా చూసిన తర్వాత ఆ సినిమా రాజపుత్రులకు అనుకూలంగా ఉంది అనే స్పష్టంగా అర్థమైంది. రాజపుత్రుల వంశానికి రాజైన షాహీద్ కపూర్ ప్రాణాలు పణంగా పెట్టి నైతిక విలవలకు కట్టుబటి ఉండటం చూశాం.

 నిర్మాతల రిక్వెస్ట్‌ను..

నిర్మాతల రిక్వెస్ట్‌ను..

పద్మావతి సినిమాను చూసిన తర్వాత ఆరోపణలు చేస్తే బాగుండేది అనే చిత్ర నిర్మాతలు ముందు నుంచి చెబుతున్నారు. కానీ ఎవరూ నిర్మాతల రిక్వెస్ట్‌ను పట్టించుకోలేదు. అందుకే ఆ సమస్య వెలుగు చూసింది. పద్మావత్ చిత్రంపై నిరసనలు, ఆందోళనలు వ్యక్తం చేయడం సినిమా పరంగా ఉండే స్వేచ్ఛపై దాడి చేయడమే అని సీరత్ కపూర్ వెల్లడించారు.

English summary
Seerat Kapoor has bagged two back-to-back hits like Raju Gari Gadi2, Okka Kshanam movies. Now she is eying on hat-trick with Touch Chesi Chudu. The actor is playing one of the love interests of Ravi Teja in Touch Chesi Chudu which is hitting the screens on February 2. Directed by Vikram Sirikonda, the film is going to show Ravi Teja in two different phases of his life. Seerat tells about casting couch and nepotism in film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu