»   » ఫిదా కథ పవన్ కళ్యాణ్ షాడోలా నడిపాడు: షాకిచ్చిన శేఖర్ కమ్ముల

ఫిదా కథ పవన్ కళ్యాణ్ షాడోలా నడిపాడు: షాకిచ్చిన శేఖర్ కమ్ముల

Posted By:
Subscribe to Filmibeat Telugu

'ఫిదా' చిత్రం, భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ సినిమా వరుణ్ తేజ్ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచింది. అయితే తాజాగా శేఖర్ కమ్ముల ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, కథానాయకుడిగా పవన్ కల్యాణ్ ను ఊహించుకుంటూ తాను ఈ కథను రాసుకున్నట్టుగా చెప్పి ఆశ్చర్యపరిచారు.

పవన్ కల్యాణ్ తో తీద్దాం అనుకున్నా

పవన్ కల్యాణ్ తో తీద్దాం అనుకున్నా

"అసలు ఫిదా సినిమాను పవన్ కల్యాణ్ తో తీద్దాం అనుకున్నా. మొదట్నుంచి ఇందులో పవన్ నే ఊహించుకున్నాను. దిల్ రాజుకు కథ చెప్పినప్పుడు కూడా పవన్ అయితే బాగుంటుందని చెప్పాను. కథ రాసుకున్నప్పుడు వెనక నుంచి ఓ షాడోలా పవన్ కల్యాణ్ తనను నడిపించారని శేఖర్ కమ్ముల తెలిపారు.

Sai Pallavi And Fidaa Going Crazy All Over
ఖుషి సినిమా ఛాయలు

ఖుషి సినిమా ఛాయలు

ఆయన చేసిన ఖుషి సినిమా ఛాయలు, ఫిదా సెకెండాఫ్‌లో కనిపిస్తాయని తెలిపాడు. అందుకే ఫిదా సినిమాను పవన్ కల్యాణ్‌తో తీద్దాం అనుకున్నానని శేఖర్ కమ్ముల తెలిపాడు. అయితే పవన్‌తో ఆ సినిమా చేయలేకపోయానని,.. అయినప్పటికీ వరుణ్ తేజ్ ఫిదాలో అదిరిపోయే నటనతో ఆకట్టుకున్నాడని ప్రశంసించాడు. ఇంతలా పవన్ ను దృష్టిలో పెట్టుకొని కథ రాసుకున్న కమ్ముల, ఆ హీరోకు మాత్రం ఈ కథను వినిపించలేదు.

ఇదే కథను రామ్ చరణ్‌కు

ఇదే కథను రామ్ చరణ్‌కు

అయితే మరో ఇద్దరు స్టార్ హీరోలకు మాత్రం వినిపించాడనీ వాళ్ళు తిరస్కరించారనీ కొన్ని రూమర్లు వచ్చాయి. ఇందులో ఎంత నిజం ఉందో గానీ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మొదట 'ఫిదా' కథను మహేశ్ బాబుకి చెప్పినా ప్రిన్స్ సున్నితంగా తిరస్కరించాడట. ఇక ఆ తర్వాత ఇదే కథను రామ్ చరణ్‌కు చెప్పాడట శేఖర్.

హీరోయిన్ డామినేటెడ్ సబ్జెక్ట్‌

హీరోయిన్ డామినేటెడ్ సబ్జెక్ట్‌

చెర్రీకి కూడా ఈ సబ్జెక్ట్ బాగా నచ్చేసిందట. అయితే హీరోయిన్ డామినేటెడ్ సబ్జెక్ట్‌గా ఉన్న 'ఫిదా' సినిమా చేయడానికి తన ఇమేజ్ అడ్డుపడుతుందని భావించి కజిన్ వరుణ్ తేజ్‌కి ఈ చిత్రాన్ని రికమెండ్ చేశాడట. శేఖర్ కమ్ముల వరుణ్ తేజ్ కథానాయకుడిగా దిల్ రాజు నిర్మాణంలో 'ఫిదా' చిత్రాన్ని పూర్తిచేయడం, సూపర్ హిట్ కొట్టడం జరిగిపోయింది.

English summary
Fidaa Director Shekhar kammula said that He wrote of Fida Story for Pawan Kalyan first
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu