For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అక్కినేని అఖిల్‌ లాంచింగ్ గురించి శేఖర్ కమ్ముల

  By Srikanya
  |

  హైదరాబాద్ "అక్కినేని అఖిల్‌తో నా సినిమా ఉండొచ్చు. కానీ ఇప్పుడే కాదు. ఇప్పుడే అఖిల్‌తో నేను సినిమా చేయబోతున్నానన్న వార్త రూమరే. అయినా ముందు కథ దొరకాలి కదా. తనకు ఇప్పటికే ఓ స్టార్ సన్‌గా, క్రికెటర్‌గా ఓ క్రేజ్ ఉంది. చేస్తే ఇవన్నీ దృష్టిలో పెట్టుకునే సినిమా చేయాలి. తను ఆల్రెడీ క్రికెట్‌తో స్టార్ అయ్యాడు అన్నారు శేఖర్ కమ్ముల. ఆయన తన తాజా చిత్రం 'లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్'విడుదల సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఇలా చెప్పుకొచ్చారు. అలాగే నాగార్జునగారితో కూడా చేయాలనే ఉంది. ఆయన బాడీ లాంగ్వేజ్ నా కథలకు యాప్ట్. నాగార్జునగారి వ్యావహారిక శైలి నా తరహా చిత్రాలకు దగ్గరగా ఉంటుంది. ఆయనతో 'గీతాంజలి'ని మించిన ప్రేమకథా చిత్రం చేయాలని ఉంది. 'హ్యాపీడేస్'ను హిందీలో చేయాలనుకుంటున్నాను'' అని చెప్పుకొచ్చారు.

  ఇక తాను స్టార్స్ తో చేయకపోవటానికి కారణం వివరిస్తూ..."స్టార్స్‌తో సినిమా చేయకూడదని నేనెప్పుడూ అనుకోలేదు. నా కథ కొత్తవారిని డిమాండ్ చేస్తే కొత్తవారితో పనిచేస్తా. స్టార్స్ కావాలంటే వారిదగ్గరకు వెళ్తాను. అలాగే నా కథలు చాలా వరకు తెలుగుదనంతో నిండి ఉంటాయి. హ్యాపీడేస్‌ను తమిళ్‌లో తీశారు. అక్కడ పెద్దగా ఆడలేదు. కారణం నా సినిమాలు మన వాతావరణానికి చాలా దగ్గరగా ఉంటాయి. తెలుగుతనం అనే సూత్రంతో అల్లుకుని ఉంటాయి. నేనెప్పుడు సినిమా చేసినా మధ్యతరగతి కుర్రాళ్ళనే ధ్యేయంగా పెట్టుకుంటాను. నా టార్గెట్ ఆడియన్స్ వారే. అలాగే సింపుల్‌గానే సినిమాలు చేస్తా. సింపుల్ సినిమాలుచేయడం చాలా కష్టం అన్నారు.

  ప్రస్తుతం ప్రేక్షకుల ఆలోచనా ధోరణి చాలా మారిపోయింది. రొటీన్ ఫార్ములా సినిమాలను చూడ్డానికి వాళ్లు అస్సలు ఇష్టపడటంలేదు. మేమంతా డిఫరెంట్‌గా ఆలోచించాల్సిన అవసరం వచ్చేసింది. ఈ రోజుల్లో మల్టీప్లెక్స్ ప్రేక్షకులను గెలుచుకోకపోతే కష్టం అన్నారు. ఈ విషయమై వివరణ ఇస్తూ...ఒకప్పుడు సమాజం ప్రశాంతంగా ఉండేది. తెరపై యాక్షన్, డ్రామాను ప్రేక్షకులు విపరీతంగా ఆస్వాదించేవారు. ఇప్పుడు సమాజంలో అన్నీ కనిపిస్తున్నాయి. అందుకే ప్రజలు సింపుల్‌గా, ప్రశాంతంగా ఉండే నా సినిమాలను ఇష్టపడుతున్నారేమో. నాకూ యాక్షన్ సినిమా తీయాలని ఉంది. కానీ అది కూడా నా మార్కుతో ఉంటుంది. చెడుపై మంచి పోరాడితే అది యాక్షన్ అని నా అభిప్రాయం. అలాగే భవిష్యత్తులో రొడ్డకొట్టుడు మూస చిత్రాలు ప్రజలను మెప్పించలేవు. ఎప్పటికప్పుడు వైవిధ్యతను కనబరుస్తుండాలి. మల్టీప్లెక్స్ మూవీస్‌దే పైచేయి అవుతుంది అని వివరించారు.

  స్వీయదర్శకత్వంలో శేఖర్ నిర్మించిన 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' రేపు (శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా గురించి దర్శకుడు శేఖర్‌ కమ్ముల మాట్లాడుతూ ''మధ్య తరగతి కుటుంబాలు, వారి అనుబంధాల నేపథ్యంలో సాగే కథ ఇది. బతకడమే ఓ అదృష్టం... అందుకే ఒకరికొకరు సాయం చేసుకొందాం అని చెప్పే ప్రయత్నం చేశాం. అమల, శ్రియ, అంజలా జవేరి పోషించిన పాత్రలు కథలో కీలకం. మిక్కీ జె.మేయర్‌ సంగీతం చిత్రానికి బలాన్నిస్తుంది''అన్నారు.

  English summary
  
 Shekar Kammula confrimed that he will work for Akkineni Akil's Launch film. After Varun Sandesh and Rana, it is learnt that director Sekhar Kammula could also be launching Akhil Akkineni in 2013. Meanwhile Akkineni family dismisses the rumours saying, “It’s too early to talk about Akhil’s acting career, since he has just completed his first year of graduation in the US. He is leaving soon to complete the remaining two years, before returning back to India.”
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X