»   » తెలుగు సినిమా దుస్థితికి సిగ్గుపడ్డాను: ప్రకాష్ రాజ్!

తెలుగు సినిమా దుస్థితికి సిగ్గుపడ్డాను: ప్రకాష్ రాజ్!

Posted By:
Subscribe to Filmibeat Telugu

సిగ్గుతో తల దించుకుంది హీరోయిన్ కాదు. జాతీయ ఉత్తమ నటుడు ప్రకాష్ రాజ్. ఎందుకంటే ఆయన 10 ఏళ్ల నటజీవితంలో ఎప్పుడూ ప్రెస్ మీట్ పెట్టలేదు. మొన్న ఆ మద్య నేషనల్ అవార్డు వచ్చినప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టలేదు. కీనీ నేడు ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే. 'లీడర్" సినిమాలో నేను నటించలేదు. దీన్ని నిర్మించనూ లేదు. ఈ సినిమాతో ఎలాంటి సంబంధమూ లేదు. కానీ సినిమా చూసిన తర్వాత కలిగిన ఆనందాన్ని మీతో పంచుకోవాలనిపించింది.

నేషనల్ అవార్డు తీసుకోవడానికి ఢిల్లీ వెళ్లినప్పుడు అవార్డ్ కమిటీ చైర్మన్ ఓ మాట అన్నారు. 'ఈసారి అన్ని భాషల నుంచి మంచి సినిమాలు వచ్చాయి. కానీ తెలుగు నుంచి ఒక్కటీ రాలేదు" అంటే సిగ్గుతో తలవంచుకున్నాను. కానీ 'లీడర్" చిత్రం చూసిన తర్వాత గర్వంగా ఫీల్ అయ్యాను. రాజకీయ నేపధ్యంలో వచ్చిన చాలా చిత్రాల్లో నటించాను. కానీ ఎందులోనూ నిజాయితీ లేదు. నా జీవితంలో నేను చూసిన నిజాయితీ గల సినిమా 'లీడర్". 'త్రి ఇడియట్స్" చూసి అమీర్ ఖాన్ కు ఫోన్ చేసి ఎంత బాధ్యతగల సినిమా తీశారంటూ అభినందించాను. మన సౌత్ లో ఇలాంటి సినిమా ఎప్పుడు వస్తుందా అనుకున్నాను.

నేను కలలు కన్న సినిమా 'లీడర్". మొన్నీ మధ్య ఓ పొలిటికల్ లీడర్ మాట్లాడుతూ..'ఏంటండి శేఖర్ కమ్ముల పోలిటిక్స్ల్ లోని నిజాలను అలా చెప్పేశాడు" అన్నాడు. ఈ సినిమా మీరొక్కరే కాదు. ఇంట్లో అందరికీ చూపించి బాద్యత గల పౌరులుగా తీర్చిదిద్దాలి. శేఖర్ కమ్ముల నిజాయితీతో తీసిన ఈ సినిమా చూసి మనమందరం ప్రోత్సహించాలి. అలాంటప్పుడే ఇలాంటి మంచి చిత్రాలు వస్తాయి" అన్నారు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu