»   » సల్మాన్ ఖాన్ నిర్మాతగా శేఖర్ కమ్ముల చిత్రం

సల్మాన్ ఖాన్ నిర్మాతగా శేఖర్ కమ్ముల చిత్రం

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: కుటుంబ ప్రక్షకులు, యూత్ మెచ్చేలా ఫీల్ గుడ్ సినిమాలు తీస్తాడనే పేరున్న దర్శకుడు శేఖర్ కమ్ముల. ఈ మధ్య కాలంలో శేఖర్ కమ్ముల పేరు ఎక్కడా వినిపించడం లేదు. ఆయన నుండి సినిమా వచ్చి చాలా కాలం అయింది. ఆయన చేసిన చివరి చిత్రం నయనతార ప్రధాన పాత్రలో వచ్చిన ‘అనామిక'.

మధ్యలో శేఖర్ కమ్ముల పలానా స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నాడు, ఆయనకు కథ చెప్పి ఒప్పించే ప్రయత్నంలో ఉన్నడంటూ వార్తలు వచ్చినా అవేమీ కార్యరూపం దాల్చలేదు. ఎట్టకేలకు శేఖర్ కమ్ముల సినిమా ఓకే అయింది.

 Sekhar Kammula set to make his Bollywood debut

ఈ సారి ఆయన ఏకంగా బాలీవుడ్లో ఛాన్స్ కొట్టేసాడు. మరో విశేషం ఏమిటంటే శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించే చిత్రాన్ని బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ నిర్మించబోతున్నారు. 2007లో వచ్చిన ‘హ్యాపీడేస్' సినిమాను హిందీలో రీమేక్ చేయనున్నారు శేఖర్ ఖమ్ముల.

శేఖ‌ర్ క‌పూర్ - సల్మాన్ ఖాన్ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నారు‌. ఈ సినిమాలో ఎంతో ముఖ్య‌మైన‌ కాలేజ్ కోసం పూణేలోని ఇంజ‌నీరింగ్ కాలేజ్ ని సెలెక్ట్ చేసినట్లు సమాచారం. నటుల ఎంపికలో ప్రస్తుతం ఈ చిత్ర బృందం నిమగ్నమై ఉంది.

English summary
Telugu director Sekhar Kammula is all set to make his Bollywood debut with the Hindi remake of his 2007 blockbuster, Happy Days. hekar Kapur and Salman Khan were said to be producing the remake.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu