»   » రాణా నెక్ట్స్ ఆ తమిళ దర్శకుడుతో కన్ఫర్మ్

రాణా నెక్ట్స్ ఆ తమిళ దర్శకుడుతో కన్ఫర్మ్

Posted By:
Subscribe to Filmibeat Telugu

శేఖర్ కమ్ముల 'లీడర్' చిత్రంతో పరిచయమైన దగ్గుపాటిరాణా త్వరలో సెల్వ రాఘవన్ దర్శకత్వంలో సినిమా చేయనున్నారు. సురేష్ ప్రొడక్షన్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇంతకు ముందు సెల్వ రాఘవన్, వెంకటేష్ కాంబినేషన్ లో 'ఆడువారి మాటలకు అర్దాలే వేరులే' చిత్రం రూపొంది విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్(ఎ.ఆర్.రహమాన్ మేనల్లుడు) సంగీతం ఇవ్వనున్నారు. రాణా ప్రస్తుతం 'దమ్ మారో దమ్' చిత్రంలో చేస్తున్నాడు. రోహన్ సిప్పీ దర్శకత్వంలో గోవా బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రంలో రూపొందుతోంది. అభిషేక్ బచ్చన్ ఈ చిత్రంలో మరో హీరోగా చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X