»   » టాలీవుడ్ లో తిరుగులేని హీరో, నా అభిమాన హీరో పవన్ కళ్యాణే....!?

టాలీవుడ్ లో తిరుగులేని హీరో, నా అభిమాన హీరో పవన్ కళ్యాణే....!?

Posted By:
Subscribe to Filmibeat Telugu

గత కొన్ని రోజులుగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రాణా హీరోగా ఓ చిత్రం రాబోతుందని వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రం పై భిన్న కథనాలు వెలువడుతున్నాయి. ఈ చిత్రం ఆగిపోయిందని కొందరంటే ఇదే చిత్రానికి సెల్వను తప్పించి గౌతమ్ మీనన్ లైన్ లోనికి వచ్చారని వార్తలు వస్తున్నాయి.

అయితే అటు సెల్వ, ఇటు రాణాలు కూడా మేం చిత్రం చేస్తున్నాం అంటూ తెలుపుతున్నారు. కానీ అది ఎప్పుడో మాత్రం వారు చెప్పడం లేదు. అయితే మళ్ళీ మరో వార్త త్వరలో సెల్వరాఘవన్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఓ పవర్ ఫుల్ మూతీ చేయనున్నాడని సమాచారం. ఈ విషయం ఆయనే స్వయంగా చెబుతున్నాడు. నాకెంతో ఇష్టమైన పవన్ కోసం ఓ కథను రెడీ చేస్తున్నాననీ..టాలీవుడ్ లో తిరుగులేని హీరో నా అభిమాన హీరో పవన్ కళ్యాణే అంటూ ఆయన తన అభిమానాన్ని తెలియజేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X