twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మెగా హీరోలా? అంతకంటే మెగా మెగాలను చూశా... అక్కడ తలవంచాల్సిందే: జయసుధ

    |

    'మహర్షి' మూవీలో మహేష్ బాబు తల్లిగా నటించిన జయసుధ ఈ మధ్య చాలా మంది హీరోలకు తల్లి పాత్రలో కనిపించిన సంగతి తెలిసిందే. తాజాగా ఓ ఇంటర్యూలో తెలుగు సినిమా హీరోల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్ బాబుకు, మెగా హీరోలకు తేడా ఏమిటనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ... 'మెగా హీరోలు' అంటే ఎవరు? అంటూ ఎదురు ప్రశ్నించారు.

    మెగా హీరోలంటే చిరంజీవి ఫ్యామిలీకి చెందిన స్టార్స్ అని యాంకర్ గుర్తు చేయగానే.. 'మీడియా వారు, ఫ్యాన్స్, ప్రొడ్యూసర్స్ మెగా ఫ్యామిలీ అనుకుంటారు కానీ, కో ఆర్టిస్టులమైన మేము అలా ఎప్పుడూ భావించము, వారు కేవలం అందరి లాగే నటులు అని మాత్రమే చూస్తాము' అన్నారు.

    అంతకంటే మెగా మెగాలను చూశాం

    అంతకంటే మెగా మెగాలను చూశాం

    ‘‘మేము నటించబోయే కో స్టార్ అప్‌కమింగ్ హీరోనా? లేదా నటనలో అనుభవం ఉన్న హీరోనా? అనేది చూస్తాం తప్ప మాకు మెగా ఫ్యామిలీ అనే తేడా ఏమీ ఉండదు. మేము అంతకంటే మెగా మెగాలను చూశాం. ఎన్టీ రామారావు దగ్గర నుంచి ఇప్పటి వరకు ఎన్నో చూశాం. అదో పెద్ద మ్యాటర్ కాదు'' అన్నారు.

    అక్కడ తలవంచాల్సిందే

    అక్కడ తలవంచాల్సిందే

    ‘‘మీడియా, ఫ్యాన్స్ బయట మాట్లాడుకునేపుడే మాత్రమే మెగా ఫ్యామిలీ లేదా మరొక ఫ్యామిలీ అని మాట్లాడుకుంటారు. సినిమా సెట్లో అలాంటివి ఏమీ ఉండవు. నువ్వు యాక్టర్ అంతే. మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా, మరే ఇతర ఫ్యామిలీ నుంచి వచ్చినా, కొత్తగా ఇండస్ట్రీకి వచ్చినా కెమెరా ముందు తలవంచాల్సిందే'' అని జయసుధ తెలిపారు.

    ఎవరున్నా యాక్టింగ్ వస్తేనే హీరో అవుతారు

    ఎవరున్నా యాక్టింగ్ వస్తేనే హీరో అవుతారు

    ‘‘మేము వారు ఎలా యాక్ట్ చేస్తున్నారో చూస్తాం. ఎందుకంటే అక్కడ ఎవరున్నా యాక్టింగ్ వస్తేనే హీరో అవుతారు. నువ్వు అక్కడ ఏదీ కావు... అక్కడ ఏ క్యారెక్టర్ ఉంటే అది మాత్రమే అవుతావు. అది సరిగా చేయకపోతే సినిమా వర్కౌట్ అవ్వదు'' అని జయసుధ చెప్పుకొచ్చారు.

    కొందరు హంబుల్‌గా... మరికొందరు యాటిట్యూడ్ చూపిస్తారు

    కొందరు హంబుల్‌గా... మరికొందరు యాటిట్యూడ్ చూపిస్తారు

    పర్సనల్‌గా వారి బిహేవియర్ ఎలా ఉంటుంది అంటే.. ఒక్కొక్కరు ఒక్కో విధంగా ఉంటారు. కొంత మంది మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా చాలా హంబుల్‌గా ఉంటారు. కొంత మంది ఎక్కడి నుంచి రాక పోయినా యాటిట్యూడ్ చూపిస్తారు. ఈ ఫ్యామిలీ.. ఆ ఫ్యామిలీ అని మేము చూడం.

    నా కొడుకులాగా ఫీలవుతాను

    నా కొడుకులాగా ఫీలవుతాను

    ‘‘రామ్ చరణ్ సెట్స్‌కు వస్తుంటే రామ్ చరణ్‌గానే చూస్తాం.. అతడు ఎలా మాట్లాడుతున్నాడో అదే చూస్తాం... చిరంజీవికి ఇతడికి తేడా ఏమిటనేది పట్టించుకోము. అలాగే మహేష్ బాబు అయినా అలాగే.. కృష్ణగారి కోణంలో చూడము. నేను సినిమాలో తల్లి పాత్ర చేస్తుంటే రెండు మూడు రోజుల షూటింగ్ తర్వాత నా కొడుకులాగా ఫీలవుతాను. లేకుంటే మనం పెర్ఫార్మ్ చేయలేం.'' అని జయసుధ చెప్పుకొచ్చారు.

    English summary
    "We are not seeing as Mega family or another family. We seeing as co-star only." Senior actor Jayasudha about Mega Family.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X