»   »  రెండో భార్య అనుమతితో...మొదటి భార్యతో టచ్‌లోనే ఉన్నాట్ట!

రెండో భార్య అనుమతితో...మొదటి భార్యతో టచ్‌లోనే ఉన్నాట్ట!

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: తెలుగు సినీయర్ నటుల్లో ఒకరైన నరేష్... ఒకప్పుడు హీరోగా తనదైన మార్కు చూపెట్టారు. ఇపుడు క్యారెక్టర్ ఆర్టిస్టుగా వరుస అవకాశాలతో దూసుకెలుతున్నారు. సినిమా రంగంలో ప్రస్తుతం ఆయన కెరీర్ బ్రహ్మాండంగా సాగుతోంది. దీనిపై సంతోషం వ్యక్తం చేస్తూ మీడియాతో నాలుగు మాటలు మాట్లాడారు.

ఇపుడు నేను చాలా సంతోషంగా ఉన్నాను, కెరీర్ బావుంది, ఫ్యామిలీతో సంతోషంగా ఉన్నాను, నా కొడుకు నవీన్ కూడా సినిమాల్లో హీరోగా పరిచయం అవుతున్నాడని తెలిపారు. ఇపుడు డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు, నటుడిగా నాకు తృప్తినిచ్చే పాత్రలు మాత్రమే చేస్తున్నాను అని తెలిపారు. చిన్న సినిమా, పెద్ద సినిమా అని నేనెప్పుడూ ఆలోచించను... అది మంచి సినిమానా? కాదా? అని మాత్రమే ఆలోచిస్తాను. మంచి సినిమా అయితే రెమ్యూనరేషన్ తగ్గించుకొని నటిస్తాను అన్నారు.

Senior actor Naresh interview about films and politics

ఆ మధ్య కొంతకాలం సినిమాలు పక్కనపెట్టి రాజకీయాల్లోకి వెళ్లిన నరేష్ అక్కడ సాధించింది ఏమీ లేక పోగా.... ఆర్థికంగా నష్టపోయారు. తర్వాత సినిమాల్లోకి వచ్చిన తర్వాత వరుస అవకాశాలు రావడంతో ఆర్థికంగా కోలుకున్నారు. తాను కష్టాల్లో ఉన్న సమయంలో కొంత మంది స్నేహితులు, బంధువులు కూడా తన గురించి తప్పుగా మాట్లాడారని, ఆ సమయంలో తన మొదటి భార్య రేఖ కూడా వదిలి వెళ్లి పోయిందని తెలిపారు.

రేఖతో విడాకుల తర్వాత రమ్యను రెండో వివాహం చేసుకున్నారు నరేష్. అయితే రేఖతో విడిపోయినా మేము స్నేహితులుగా కొనసాగుతున్నాం, రమ్య అనుమతితో ఆమె చేస్తున్న ఓ ప్రాజెక్టుకు నేను సహాయం కూడా చేస్తున్నాను అని నరేష్ తెలిపారు. ప్రస్తుతం రాజకీయాల గురించి ఆలోచించడం లేదని, సినిమాల్లోనే కొనసాగుతానని నరేష్ తెలిపారు.

English summary
Senior actor Naresh interview about films and politics.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu