For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  వేడెక్కిన టాలీవుడ్ వివాదం: నాకే పాపమూ తెలీదు, చిక్కుల్లో సీనియర్ నటి

  |

  ఒకప్పటి నటి తులసి ఈ మధ్య "మా" అధ్యక్షుడు, నటుడు శివాజీ రాజాని ఏ రేంజి లో అవమానించిందో అందరూ చూసారు. ట్విటర్‌ సాక్షిగా ఆ నటుడిని అనకూడని మాటలన్నీ అనేసింది. అయితే ఇప్పుడు ఆ యాక్షన్ కి రియాక్షన్ గట్టిగానే వచ్చింది. తులసి నోటి దురుసుతనంపై మండిపడిన శివాజీరాజా చట్టపరమైన చర్యలకు సిద్ధమైపోయాడు.

   శంకరాభరణం అవార్డ్స్

  శంకరాభరణం అవార్డ్స్

  మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కు ప్రెసిడెంట్ గా ఉన్న వ్యక్తిని జోకర్ తోను.. బఫూన్ తోనూ పోల్చేసింది నటి తులసి. ప్రస్తుతం తల్లి పాత్రలు చేస్తున్న నటి తులసి.. శంకరాభరణం చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ను ప్రారంభించి ప్రస్తుతం సీనియర్ ఆర్టిస్ట్ స్థాయికి చేరుకోగా.. కొన్ని రోజుల క్రితం శంకరాభరణం అవార్డ్స్ ను ఈమె ఆధ్వర్యంలో నిర్వహించారు.

  జూనియర్ ఎన్టీఆర్

  జూనియర్ ఎన్టీఆర్

  ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ తో సహా పలువురు స్టార్లను ఆహ్వానించగా.. ఎవరూ అటెండ్ కాలేదన్న మాట వాస్తవమే. అయితే.. ఇలా స్టార్లు ఎవరూ తమ కార్యక్రమానికి రాకుండా.. మా ప్రెసిడెంట్ గా ఉన్న శివాజి రాజా అడ్డుకున్నాడని తులసి ఆరోపిస్తున్నారు.

  Tollywood drugs scandal : Tollywood Top Director, Heroes and 3 Heroines Names revealed
  శివాజి రాజా బఫూన్

  శివాజి రాజా బఫూన్

  తన పదవిని దుర్వినియోగం చేస్తున్నాడని.. ఆ సీట్ లో కూర్చున్న బఫూన్ అని.. అదేమీ పర్మినెంట్ సీట్ కాదని తెలుసుకోవాలని.. ఇలా రకరకాలుగా శివాజి రాజాను ట్విట్టర్ లో తిట్టిపోయడమే కాకుండా.. పలు ఛానెల్స్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ మీద పోస్త్ చేసేసింది. తులసి కామెంట్లకు శివాజిరాజా కౌంటర్లేమి ఇవ్వలేదు. కనీసం ఈ విషయం గురించి ఎక్కడ స్పందించలేదు.

   హర్ట్ అయిన శివాజి రాజా

  హర్ట్ అయిన శివాజి రాజా

  అయితే తులసి చేసిన వ్యాఖ్యలకు బాగా హర్ట్ అయిన శివాజి రాజా ఆమెపై పరువు నష్టం దావా వేయాలని ఫిక్స్ అయ్యాడట. ఇప్పటికే లీగల్ అడ్వైజర్స్ తో సంప్రదింపులు జరిపారట. అయితే విషయం తెలిసుకున్న తులసి అసలు తాను శివాజి రాజాను ఏమి అనలేదని.. ట్విట్టర్ యాండిల్ తన చేతిలో లేదని మాట మార్చేసింది.

  అనరాని మాటలను అన్నందుకు

  అనరాని మాటలను అన్నందుకు

  ఏది ఏమైనా మా అధ్యక్షుడిగా ఉన్న శివాజి రాజాపై అనరాని మాటలను అన్నందుకు తులసి పై మా యాక్షన్ తీసుకునే ఆలోచనలో ఉందట. మరి ఈ వ్యవహారం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి. శివాజీరాజా నిజంగా న్యాయస్థానాన్ని లేదా పోలీసులను ఆశ్రయిస్తే తులసికి చిక్కులు తప్పవన్న వార్తలు బాగా హల్‌చల్‌ చేస్తున్నాయి. దీంతోతో తేరుకున్న తులసి తులసి దిద్దుబాటుచర్యలు మొదలెట్టేసింది.

  తనకెలాంటి పాపమూ తెలియదని

  తనకెలాంటి పాపమూ తెలియదని

  ఆ ట్విటర్‌ తనది కాదనీ, ఎవరో తన పేరు మీద క్రియేట్‌ చేసి శివాజీరాజాను అనరాని మాటలు అన్నారనీ, ఇందులో తనకెలాంటి పాపమూ తెలియదని చెబుతోంది. కావాలంటే తన ట్విటర్‌ను పరీక్షించుకోవచ్చని కూడా అంటోంది. ఇంత వివాదానికి కారణమైన ఆ ట్విటర్‌ మెసేజ్‌ ఇప్పుడు కనిపించకుండా పోయిందట!

  English summary
  Finally, Tulasi issued a clarification that the Twitter handle, on which disrespectful remarks had been posted, doesn't belong to her at all.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X