twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చెట్టుపేరు చెప్పుకునే హీరోలే అంతా... తమ్మారెడ్డి సంచలన పంచ్

    |

    తమ అభిమాన హీరఒ సినిమా హిట్టయితే సంబరాలు చ్ఘేసుకోవటం దగ్గర్నుంచీ.. మరో హీరో సినిమా ఫ్లాప్ అయినందుకు కూడా సంబరాలు చేసుకునే రోజుల్లో ఉన్నాం. అభిమానాలు ఇప్పుడు వ్యక్తిగత పరిథులని దాటేశాయి. ఒక నటుడి మీద అభిమానం కాస్తా మరొక నటుడి మీదా అథని అభిమానులమీదా ద్వేషంగా మారుతోంది. రెండురోజుల క్రితం జరిగిన వినోద్ హత్య ఈ ఉన్మాద అభిమానానికి పరాకాష్ట. అయితే ఇంత పిచ్చిగా ప్రవర్తించటం ఆ అభిమానుల తప్పే అయినా...

    తమకి సమాజం లోని కొంత భాగాన్ని ప్రభావితం చేయగలం అని అర్థమైనప్పుడే. తమ అభిమానులకి అనవసర విద్వేషాలకి తావివ్వకూడదని చెప్పి ఉండాల్సింది. భీమవరం లాంటి పట్టణం లో అంత ఎత్తున వర్గ పోరాటాల కింద ఫ్యాన్ వార్ జరిగినప్పుడే టాలీవుడ్ హీరోలంతా కలిసి కట్టుగా స్పందించాల్సింది... కానీ అలా జరగలేదు. ఇప్పుడు ఏకంగా చంపుకోవటం వరకూ వచ్చింది... అసలు ఒక హీరో ఒక ప్రకటన చేయటానికి రెండు నిమిషాలకంటే ఎక్కువ సమయమూ పట్టదు.... ఇదే విషయం మీద స్పందిస్తూ తమ్మారెడ్డి భరద్వాజ ఏమన్నారో చూడండి...

    చెట్టు పేరు చెప్పుకుని తిరిగే హీరోలే:

    చెట్టు పేరు చెప్పుకుని తిరిగే హీరోలే:

    టాలీవుడ్ మొత్తం లో మరీ నిర్మొహమాటంగా కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడే అతికొద్దిమందిలో తమ్మారెడ్డి భరద్వాజ ఒకరు. రెండు రోజుల క్రితం జరిగిన ఫ్యాన్ వార్ లో వినోద్ అనే యువకుడు ప్రాణాలు కోల్పోవటం విచారకరం. ఈ ఘటన పై స్పందిస్తూ ‘చెట్టు పేరు చెప్పుకుని తిరిగే హీరోలే ఎక్కువ అయిపోయారు' అని వ్యాఖ్యానించారు. తమ్మారెడ్డి భరద్వాజ.

    ఓ గట్టి నిర్ణయం తీసుకోవాలి:

    ఓ గట్టి నిర్ణయం తీసుకోవాలి:

    ఏదో కంటి తుడుపుగా అభిమానులు గొడవలు పడొద్దు అంటూ స్టేజీలెక్కి చెప్పినంత మాత్రాన ఏ ప్రయోజనం లేదని.. ఇలాంటి గొడవల్ని నివారించడానికి హీరోలందరూ ముందుకొచ్చి ఓ గట్టి నిర్ణయం తీసుకోవాలని తమ్మారెడ్డి అన్నారు.

    కత్తులతో దాడులా? :

    కత్తులతో దాడులా? :

    తమ అభిమాన హీరోల్లో ఎవరు గొప్ప అనే వాదనలతో మొదలై.. కత్తులతో దాడి చేసుకునే స్థాయికి విభేదాలు ముదరడం తీవ్రమైన విషయం అని..

    పెద్ద హీరోలు కలిసికట్టుగా:

    పెద్ద హీరోలు కలిసికట్టుగా:

    చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లాంటి పెద్ద హీరోలు కలిసికట్టుగా ఏదైనా చేస్తే తప్ప ఇలాంటి సంఘనటలు ఆగవని ఆయన అన్నారు. అభిమానుల్లో ధ్వేషం పెరగడానికి సినిమాల్లో వచ్చే పిచ్చి పిచ్చి పంచ్ డైలాగులు కూడా కారణమని తమ్మారెడ్డి చెప్పారు.

    ఆత్మపరిశీలన అవసరం:

    ఆత్మపరిశీలన అవసరం:

    ప్రస్తుత హీరోలందరూ బాగా చదువుకున్నవాళ్లేనని.. ఇలాంటి డైలాగుల విషయంలో ఆత్మపరిశీలన చేసుకోవాలని కనీసం ఇప్పుడైనా కాస్త వాస్తవిక ధోరణిలో ఆలోచించాలనీ అభిప్రాయ పడ్డారు.

    మా రోజుల్లో ఇలా కాదు:

    మా రోజుల్లో ఇలా కాదు:

    తమ రోజుల్లోనూ అభిమాన సంఘాలున్నప్పటికీ.. ఇలాంటి దారుణమైన ఘటనలు లేవని.. తాను.. దాసరి లాంటి పెద్దవాళ్లు ఏదైనా చెబితే వినే పరిస్థితి లేదని.. హీరోలు ఈ విషయంలో పునరాలోచించుకోవాలని ఆయన అన్నారు.

    English summary
    senior producer Thammareddy Bharadwaja fired on all the Tollywood stars. The veteran producer said that all the Tollywood stars should come on one stage and tell their fans that there's no bad blood between them, and that this will cultivate a healthy relationship among all the fans.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X