»   » అప్పుడు ‘మాయా బజార్’.... ఇపుడు ‘బాహుబలి’

అప్పుడు ‘మాయా బజార్’.... ఇపుడు ‘బాహుబలి’

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: బాహుబలి సినిమాకు సంబంధించి అతి కీలకమైన టెక్నీషియన్లలో సినిమాటోగ్రాఫర్ సెంథిల్ కుమార్ ముఖ్యుడు. ఈ సినిమాకు సంబంధించిన రాజమౌళి ఊహలను తన కెమెరా కన్ను ద్వారా తెరపై అద్భుతంగా ఆవిష్కరించేది ఆయనే. గతంలో విజువల్ ఎఫెక్ట్స్ ప్రధానంగా వచ్చిన అరుంధతి, యమదొంగ, మధగీర, ఈగ లాంటి చిత్రాలకు ఆయన పని చేసారు.

బాహుబలి మూవీ జులై 10న విడుదలవుతున్న నేపథ్యంలో సెంథిల్ కుమార్ మీడియాతో తన అనుభవాలను పంచుకున్నారు. ప్రముఖ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ బాహుబలి సినిమాకు పని చేసే అవకాశం రావడం తన అదృష్టంగా పేర్కొన్నాడు.


Senthil Kumar about Baahubali movie

బాహుబలి సినిమా మా టీంకు మాత్రమే కాదు...భారతీయులంతా గర్వంగా చెప్పుకునే విధంగా ఉంటుందన్న సెంథిల్ ఇలాంటి సినిమా హళ్లీ ఎవరైనా తీస్తారో లేదో తెలియదు. ఇప్పటి వరకు తెలుగు సినిమా పరిశ్రమకు సంబంధించి ‘మాయా బజార్' గురించి ఎంత గొప్పగా చెప్పుకుంటున్నామో...ఇకపై బాహుబలి గురించి అలా చెప్పుకోవాల్సి వస్తుంది అన్నారు.


గడిచిన మూడేళ్ల సమయం అంతా ‘బాహుబలి' సెట్స్ మీదనే గడిచి పోయింది. ఈ సినిమా కోసం నా పూర్తి సమయం కేటాయించానంటే తన భార్య రూహీ తోడ్పాటు ఉండటం వల్లనే సాధ్యమైంది. ఆమె ఇంటి సంగతులు చక్కదిద్దడం వల్లనే నేను ఎలాంటి టెన్షన్ లేకుండా పని చేయగలిగానని అంటున్నాడు సెంథిల్.

English summary
Senthil Kumar about Baahubali movie. K.K. Senthil Kumar is one of the Most popular cinematographer in Indian Cinema.
Please Wait while comments are loading...