»   »  'గాయం' సీక్వెల్?

'గాయం' సీక్వెల్?

Posted By:
Subscribe to Filmibeat Telugu
Gayam
ఇప్పుడు టాలీవుడ్ లో ఎక్కడి విన్నా సీక్వెల్స్ ముచ్చట్లే. పరిశ్రమలో చాలామంది గతంలో వచ్చి హిట్టయిన సినిమాలన్నిటినీ పరిశీలిస్తూ సీక్వెల్స్ కి యేవి వర్కవుట్ అవుతాయోనని అంచనాలు వేస్తున్నారు. తాజాగా రామగోపాల్ వర్మ ...జగపతిబాబు హీరోగా తీసిన 'గాయం' పై వారి దృష్టి పడింది. ఆ ఆలోచన జగపతి బాబునీ చేరింది. దాంతో ఒక రకంగా జగపతిబాబుకి కొత్త ఇమేజ్ నిచ్చిన ఆ యాక్షన్ చిత్రాన్ని మళ్ళీ ఆయనే నిర్మించాలనుకుంటున్నారట.

దర్శకుడు మాత్రం వేరే కొత్తవాడు ఉండే అవకాశం ఉందని వినిపిస్తోంది. నిజానికి ఆ చిత్రం దాకా జగపతి వాయస్ ఎవరికీ నచ్చేది కాదు. కానీ గాయం ఆ ఇమేజ్ ని మార్చేసింది. ఎంతగా అతని వాయస్ నచ్చటం పెర్గిందంటే చివరకు 'విక్టరీ' సినిమా ప్రోమోకు వాయస్ ఓవర్ ఇచ్చేదాకా ఎదిగింది. దాంతో అలాంటి చిత్రం సీక్వెల్ చెయ్యటం కరెక్టు డెసిషన్ అని సన్నిహితులు కూడా చెప్తున్నారట. కాబట్టి త్వరలోనే ఈ ఆలోచన కార్యరూపం దాల్చే అవకాశం ఉంది. ప్రస్తుతం జగపతిబాబు 'కథానాయుకుడు' చిత్రంలో రజనీకాంత్ కి బాల్య స్నేహితుడు గా చేస్తున్నాడు.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X