»   »  ఈ సారైనా నమ్మొచ్చా ?? ఆ సినిమా కి హిందీలో సీక్వెల్ వస్తోందట

ఈ సారైనా నమ్మొచ్చా ?? ఆ సినిమా కి హిందీలో సీక్వెల్ వస్తోందట

Posted By:
Subscribe to Filmibeat Telugu

స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్‌, అర్జున్ కాంబినేష‌న్ లో విడుద‌లైన చిత్రం "మొద‌ల్‌వ‌న్‌". ఈ చిత్రాన్ని తెలుగులో "ఒకే ఒక్క‌డు" అనే పేరుతో విడుద‌ల చేశారు. హిందీలో అనిల్ క‌పూర్ హీరోగా "నాయక్" పేరుతో సినిమా రీమేక్ అయ్యింది. తెలుగు, తమిళంలో 1999లో ఈ సినిమా విడుదల కాగా, హిందీలో 2001లో విడుదలైంది. మూడు భాష‌ల్లో సూప‌ర్ హిట్ చిత్రంగా అంద‌రి మ‌న్న‌నలు అందుకుంది. ఇప్పుడు ఈ చిత్రానికి హిందీలో రీమేక్ రూపొందనుంద‌ట‌.

ఇదివరకు కూడా తెలుగులో కూడా ఓ మూడేళ్ళ క్రీతమే ఈ సినిమాకి సీక్వెల్ తీస్తున్నారనీ, పవన్ కళ్యాణ్ ఆ సినిమాకి హీరో అనీ వార్తలు వచ్చాయి. అయితే తర్వాత ఏమైందో గానీ మళ్ళీ ఎటువంటీ న్యూసూ లేకుండానే పవన్ ఒకేఒక్కడు అటకమీదకి చేరిపోయింది.

Sequel to Sensational Film after 15 Years

ఇప్పుడు ఈ సినిమాకి హిందీ సీక్వెల్ చేయడానికి అవకాశాలు ఏర్పడుతున్నాయనే టాక్ వినిపిస్తోంది. ఈరోస్ ఇంటర్నేషనల్ వారితో కలిసి, దీపక్ ముకుత్ ఈ సీక్వెల్ ను రూపొందించాలనే ఆలోచన చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.దేశంలో పెరిగిపోతున్న అవినీతి, అక్రమాలు ఈ చిత్రంలో చర్చించనున్నట్లు చెన్నై వర్గాల సమాచారం.

సినిమా పూర్తిగా దేశ రక్షణదళంలో పేరుకుపోయిన అవినీతి చుట్టూ తిరుగబోతున్నట్లుగా చెప్తున్నారు. ఆ దిశగా సన్నాహాలు కూడా మొదలుపెట్టారని అంటున్నారు. ఈ సినిమాకి కథను రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్ అందిస్తుండటం విశేషం. సీక్వెల్లో హీరో, హీరోయిన్లను ఇంకా సెలెక్ట్ చేయలేదు. కథ రాయడం ప్రారంభించాను. కంప్లీట్ చేయడానికి కొంత టైం పడుతుందని చెబుతున్నారు.ఈ సీక్వెల్ కి దర్శకుడు ఎవరు? నటీనటులు ఎవరు? అనే విషయంలో త్వరలోనే స్పష్టత రానుంది.

English summary
"Nayak", the Hindi remake of sensational flick ‘Oke Okkadu’, went on to become a commercial success in 2001. Anil Kapoor played the lead role Shivaji Rao and Rani Mukherjee appeared as his love interest in the Hindi version.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu