»   »  పాట కోసం యేడు కోట్ల ఖర్చు!!!

పాట కోసం యేడు కోట్ల ఖర్చు!!!

Posted By:
Subscribe to Filmibeat Telugu
Akshy Kumar
బాలీవుడ్ లో హాట్ టాపిక్ దాదాపు యేడు కోట్ల రూపాయలు ఒక సాంగ్ కోసం ఖర్చు పెట్టటం. ఆ సాంగ్ లో నటించే అదృష్టాన్ని అక్షయ్ కుమార్ పొందాడు. అతను హీరోగా చేస్తున్న 'సింగ్ ఈజ్ కింగ్' అనే సినిమాలో ఈ సాహసం చేస్తున్నారు. అంతకు ముందు అక్షయ్ కుమార్ 'భాగమ్ భాగ్' లో ఒక కోటి రూపాయలు తో పాట తీయటం విచిత్రంగా చెప్పుకున్నారు. మళ్ళీ అదే రకంగా అక్షయ్ కమార్ కి ఆఫర్ రావటం మిగతా హీరోలు కుళ్ళుకునేటట్లు చేస్తోంది. ఈ సాంగ్ లో అక్షయ్ ఫేమస్ అమెరికన్ పాప్ సింగర్ Snoop Dogg తో డాన్స్ చేస్తారు.

విపుల్ షా దర్శకత్వంలో రెడీ అవుతున్న ఈ సినిమాపై ట్రేడ్ లో విపరీతమైన అంచనాలు ఉన్నాయట. దాంతో వాటిని అందుకోవటానికి ఈ రకమైన జిమ్మిక్కులు చేయాల్సి వస్తోందిట. ఆ పాటని Snoop Dogg టీమ్ నేతృత్వంలోనే భారీగా చిత్రీకరిస్తారట. ఒక రకంగా ఈ పాటతో అంతర్జాతీయ మార్కెట్ ని కూడా ఆకర్షించే ప్రయత్నంగా దర్శక నిర్మాతలు భావిస్తున్నారట. ఇక ఈ సాంగ్ లో చేస్తున్న అక్షయ్ ఆనందానికి ఐతే అంతే లేదుట. అందులోనూ ఆ పాప్ సింగర్ ఆల్బమ్స్ ని అక్షయ్ చాలా కాలంగా ఫాలో అవుతున్నాడట. ఇవన్నీ ప్రక్కన పెడితే మన తెలుగుకి యేడు కోట్లనేది మంచి యాక్షన్ సినమా చేసే బడ్జెట్.అంటే అక్కడ పాట మన సినిమా రేంజి అన్నమాట.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

X