»   » ‘వరుడు’ సినిమాలా బన్నీకి మొత్తం ఏడు రోజుల పెళ్లి..!

‘వరుడు’ సినిమాలా బన్నీకి మొత్తం ఏడు రోజుల పెళ్లి..!

Posted By:
Subscribe to Filmibeat Telugu

మొన్న గ్రాండ్ గా పెళ్లిచేసుకున్న అల్లు అర్జున్ నిన్న నోవాటెల్ హోటల్లో మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ కు రిసెప్షన్ పార్టీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలు మూలల నుంచి బన్నీ అభిమానులు తరలివచ్చారు. నూతన దంపతులు వారికి ఆత్మీయ స్వాగతం పలికారు. తమ కుటుంబంపై ఫ్యాన్స్ చూపుతున్న ఆదరణకు మెగాస్టార్ చిరంజీవి, అల్లు అరవింద్ కృతజ్ఞతలు తెలిపారు. తమ కోసం ప్రత్యేకంగా ఫంక్షన్ ఏర్పాటు చేయడం పట్ల అభిమానులు సంతోషం వ్యక్తం చేసారు.

కాగా, ఈ వేడుకలో అల్లు అరవింద్ ఓ నిజాన్ని బయటపెట్టాడు. 'మా బన్నీ మొదట్లో తన పెళ్లిని డెస్టినేషన్ మేరేజ్ గా చేసుకోవాలనుకున్నాడు. అంటే, దూరంగా ఎక్కడో సన్నిహితులతో జరుపుకుని, ఇక్కడికొచ్చాక రిసెప్షన్ ఇద్దామన్నాడు. మా వియ్యంకుడు గారికి ఈ విషయం చెబితే, 'అలా కుదరదు. పెళ్లి ఇక్కడే వైభవంగా జరిగితీరాల్సిందే' అంటూ పెళ్ళికి ముందే బన్నీకి చెక్ పెట్టారు. అప్పుడు బన్నీ 'అయితే.. వరుడు సినిమాలోలా ఐదు రోజుల పెళ్లి చేసుకుంటాను' అన్నాడు. సరే అన్నాం. తీరా ఇప్పుడు ఈరోజు ఈ ఫంక్షన్ తో కలిపి ఏడురోజుల పెళ్లి అయింది" అన్నారు నవ్వుతూ. తండ్రి మాటలకి బన్నీ సిగ్గుతో ముసిముసి నవ్వులు నవ్వాడు!

English summary
Allu Aravind says, ‘In fact, I suggested the marriage in another state and host a reception in our state. But Bunny’s father-in-law insisted that it should be held in this state amidst pomp and gaiety. My son asked to do the marriage for five days on the lines of his recent film ‘Varudu’. But we had celebrated it for seven days. We are very happy that the function was held amidst the fans.’
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu