Just In
Don't Miss!
- News
శివమొగ్గలో భారీ పేలుడు: 15 మంది మృతి?, భూమి కంపించడంతో భయంతో జనం పరుగులు
- Finance
తగ్గిన బంగారం ధర, పెరిగిన వెండి ధర: రూ.50,000 దిగువనే బంగారం
- Sports
సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం కష్టమే: జోరూట్
- Automobiles
ఉత్పత్తిలో '100 మిలియన్' రికార్డ్ కైవసం : హీరోమోటోకార్ప్
- Lifestyle
Happy Republic Day 2021 :మనందరికీ ప్రేరణనిచ్చే ఈ మెసెజెస్ తో ‘రిపబ్లిక్ డే’ విషెస్ చెప్పండిలా...
- Technology
వన్‌ప్లస్ నార్డ్ స్మార్ట్‌ఫోన్ ప్రీ-ఆర్డర్స్ ఇండియాలో జూలై 15 మధ్యాహ్నం 1.30 గంటల నుండి మొదలు
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
బాహుబలి మొదటి అడుగుకి ఏడేళ్లు.. విజయం అప్పుడే మొదలైంది
ఇండియన్ సినిమా హిస్టరిలో మునుపెన్నడు లేని విధంగా బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన చిత్రం బాహుబలి. ఒక తెలుగు సినిమా ప్రపంచ సినీ లోకం ఇటు వైపు చూసేలా చేసింది అంటే అది మాములు విషయం కాదు. ఇక ఆ సినిమా షూటింగ్ కి మొదటి అడుగు పడి నేటికి ఏడేళ్లవుతోంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటోంది.
2013 జులై 6న బాహుబలి షూటింగ్ మొదలైంది. కర్నూల్ లోని ఫేమస్ రాక్ గార్డెన్ లో మొదలైన ఆ క్షణాలను చిత్ర యూనిట్ ఇప్పటికి మరచిపోలేదు. ఆభిమానులు కూడా ఆ ఫొటోలు చూసి అప్పట్లో ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకంటే షూటింగ్ చూడటానికి ఆ ప్రదేశానికి పరిసర ప్రాంతాల నుంచి వేల సంఖ్యలో అభిమానులు వచ్చారు.

జనాల మధ్యలోనే దర్శకుడు రాజమౌళి షూటింగ్ ని స్టార్ట్ చేశాడు. ప్రభాస్ ని డైరెక్ట్ గా చూసిన అభిమానులు ఎంతగానో ఆనందించారు. ప్రభాస్ కూడా జనాలను కాసేపు అలానే చూస్తూ అభివాదాలు తెలియజేశాడు. ఇక బాహుబలి మొదటి పార్ట్ 2015 జులై 15న విడుదలైన విషయం తెలిసిందే. ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా కీలక పాత్రల్లో నటించిన ఈ బిగ్ బడ్జెట్ సినిమాను ఆర్కా మీడియా వర్క్స్ నిర్మించింది.