»   » వాళ్లని అంగం కట్ చేసి, నపుంసకలను చేయాలి: మీరా జాస్మిన్

వాళ్లని అంగం కట్ చేసి, నపుంసకలను చేయాలి: మీరా జాస్మిన్

Posted By:
Subscribe to Filmibeat Telugu

కోచి: 'అమ్మాయి బాగుంది', 'గుడుంబా శంకర్', 'మహారధి', 'యమగోల 2', 'పందెం కోడి' లాంటి సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసిన మలయాళ భామ మీరా జాస్మిన్ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది.

ఏదన్నా తెలుగు సినిమా చేస్తోందా..ఇప్పుడు ఆమె గురించి న్యూస్ రాస్తున్నారు అంటారా..అదేమీ కాదు..ఆమె ఇచ్చిన ఓ స్టేట్ మెంట్ ఇప్పుడు సంచలనమైంది. ఇంతకీ ఆమె ఏ విషయమై మాట్లాడింది అంటే...రేప్ చేసే వారికి వెయ్యాల్సిన శిక్ష గురించి.

భధ్రత మధ్య మీరా జాస్మిన్ వివాహం (ఫోటోలు)

ఇటీవల కేరళలోని పెరుంబవూర్‌లో దళిత మహిళ అత్యాచారానికి గురై.. హత్య చేయబడింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లితోపాటు, నటుడు అనూప్‌తో కలిసి మీరా జాస్మిన్‌ మీడియాతో మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం.

బీజకోశాలు కత్తిరించండి

బీజకోశాలు కత్తిరించండి

రేపిస్టులపై ప్రముఖ హీరోయిన్‌ మీరా జాస్మిన్‌ సంచలన వ్యాఖ్యలు చేసింది. మహిళలపై లైంగిక దాడులను చేసేవారికి క్యాస్ట్రేషన్‌ (బీజకోశాలను కత్తిరించి నపుంసకులుగా మార్చడం) ఒక్కటే సరైన శిక్ష అని అన్నారు.

సమర్దవంతంగా లేదు

సమర్దవంతంగా లేదు

రేపిస్టుల సైతం ఆ బాధను అనుభవించినప్పుడు ఇలాంటి ఘటనలు తగ్గుతాయని ఆమె పేర్కొన్నారు. ప్రస్తుతమున్న చట్టాలతో లైంగిక దాడులు వంటి నేరాలను సమర్థంగా ఎదుర్కొనలేకపోతున్నామని పేర్కొంది.

అంగ విచ్చేదన

అంగ విచ్చేదన

'మహిళలపై లైంగిక దాడులు జరుపుతున్న వారికి నొప్పి కలిగించే శిక్షలు ఇవ్వాల్సిన అవసరముంది. అలాంటివారిని ఎదుర్కోవడానికి క్యాస్ట్రేషన్‌ (అంగ విచ్ఛేదన) ఒక్కటే మార్గం' అని మీరా జాస్మిన్ పేర్కొంది.

నొప్పి కలిగించే..

నొప్పి కలిగించే..

'అలాంటి నొప్పి కలిగించే శిక్షలు విధిస్తే.. వారు జీవితంలో మహిళలను తాకడానికి సాహసించరు' అని తెలిపింది. ఇప్పుడీ వాఖ్యలు కేవలం కేరళలోనే కాకుండా దేశమంతటా చర్చకు దారితీసింది. అందరూ మీరా మాటలను సమర్దిస్తున్నారు.

రేప్, హత్య

రేప్, హత్య

ఇటీవల కేరళలోని పెరంబవూర్‌లో దళిత మహిళ అత్యాచారానికి గురై.. హత్య చేయబడింది. ఈ నేపథ్యంలో బాధితురాలి తల్లితోపాటు, నటుడు అనూప్‌తో కలిసి మీరా జాస్మిన్ మీడియాతో మాట్లాడింది.

రేప్ బాధితురాళ్లపై

రేప్ బాధితురాళ్లపై

రేప్‌ బాధితురాళ్లపై మీరా జాస్మిన్‌ నటించిన తాజా సినిమా 'పాథు కల్పనకల్‌' సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆమె ఈ విలేకరుల సమావేశం నిర్వహించింది. ప్రస్తుతమున్న చట్టాలతో లైంగిక దాడులు వంటి నేరాలను సమర్థంగా ఎదుర్కొనలేకపోతున్నామని పేర్కొంది.

రన్ తో గుర్తింపు..

రన్ తో గుర్తింపు..

మీరా జాస్మిన్ ఇప్పటి వరకు సౌతిండియాలో అన్ని భాషలలో నటించింది. 'రన్" అనే తమిళ సినిమాని తెలుగు డబ్బింగ్ తో తెలుగు సినీ రంగ ప్రవేశం చేసిన మీరా తర్వాత తెలుగు ఇండస్ట్రీలోని పెద్ద హీరోలతో చేసింది.

సాప్ట్ వేర్ ఇంజినీరుతో

సాప్ట్ వేర్ ఇంజినీరుతో

2014 ఫిబ్రవరి 12 వ తేదీన తిరువనంతపురంలోని ఓ చర్చిలో జరిగింది. మీరా జాస్మిన్ దుబాయ్ కి చెందిన అనిల్ టైటస్ అనే ప్రొఫెషనల్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ని పెళ్లి చేసుకుంది.ఆ తర్వాత వీరి పెళ్లిని ఎర్నాకులం రిజిస్ట్రార్ ఆఫీసులో రిజిస్టర్ కూడా చేసారు. అలాగే ఇది పెద్దలు కుదిర్చిన వివాహం. అది కూడా పెళ్లి సంబందాలు చూసే ఓ ఫేమస్ వెబ్ సైట్ ద్వారా ఈ పెళ్లి కుదిరినట్టు సమాచారం.

పుల్ స్టాప్

పుల్ స్టాప్

వివాహానంతరం ఒక సంవత్సరం పాటు నటనకు పుల్ స్టాప్ పెట్టింది. అయితే ఇప్పుడు మళ్ళీ వెండితెరపైకి వచ్చి తనేంటో ప్రూవ్ చేసుకునే పనిలో పడింది. అయితే ఈ సినిమా విజయంపై ఆమె నటనా జీవితం ఏ మేరకు కొనసాగనుందనే విషయం తెలుస్తుంది.

అందుకే పెళ్లి

అందుకే పెళ్లి

ఎప్పటికప్పుడు మారుతున్న జనరేషన్ తో పాటు మారకపోవటం, కుర్ర హీరొయిన్లతో పోటీ పడలేక వెనుక పడిపోయింది మీరా. ఎలాగు సినిమా చాన్సులు లేవు కానుగ పెళ్లి చేసుకొని ఫ్యామిలీ లైఫ్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటోందని చాలా కాలం క్రితమే వార్తలు వచ్చాయి.

అవార్డ్ లు,రివార్డ్ లు

అవార్డ్ లు,రివార్డ్ లు

నటిగా మీరా జాస్మిన్ నటనకు ఎక్కడా వంక పెట్టలేం. 2004లో మలయాళీ చిత్రం 'పాదమ్ ఒన్ను: ఒరు విలాపమ్'లో ప్రదర్శించిన నటనకు గాను జాతీయ ఉత్తమనటి అవార్డు పొందింది. మీరా తెలుగులో అమ్మాయి బాగుంది, గుడుంబా శంకర్, భద్ర, గోరింటాకు, మహారథి, ఆఆఇఈ, ఆకాశ రామన్న, మోక్ష వంటి చిత్రాల్లో నటించింది.

ఆగిపోయిన చిత్రం

ఆగిపోయిన చిత్రం

హఠాత్తుగా ఆమె కెరీర్ ఫేడ్ అవుట్ అవటంతో ...ఆమె నటించిన సినిమాలు రిలీజ్ లు ఆగిపోయాయి. ఎన్నో రోజులు క్రితం పూర్తయినా విడుదలకు నోచుకుని మీరా జాస్మిన్ చిత్రం మోక్ష. మీరా జాస్మిన్‌ ప్రధాన పాత్రలో రూపొందుతున్నఈ 'మోక్ష' చిత్రం ఓ హర్రర్. 'బ్లాక్‌ అండ్‌ వైట్‌' చిత్ర దర్శకుడు శ్రీకాంత్‌ వేములపల్లి ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు.

English summary
Condemning strongly the atrocities against women in the society, leading South Indian actress Meera Jasmine today said that severe punishments, including castration, should be awarded to the guilty.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu