»   » సెక్స్ రాకెట్ గుట్టు బయట పడింది .., "నా బంగారు తల్లి" నిర్మాత చొరవ...

సెక్స్ రాకెట్ గుట్టు బయట పడింది .., "నా బంగారు తల్లి" నిర్మాత చొరవ...

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలలోని జిల్లాల నుంచి సినిమాల అవకాశం, ఉద్యోగాల కోసం నగరానికి వచ్చే యువతులను శివకుమార్‌ అనే వ్యక్తి టార్గెట్‌ చేసి వ్యభిచారంలోకి దింపుతున్నాడని ప్రజ్వల సంస్థ డైరెక్టర్‌ సునీతా కృష్ణన్‌ గోపాలపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. 'నా బంగారుతల్లి' చిత్రానికి నిర్మాతగా ఉన్న సునీతా కృష్ణన్‌‌కు నేషనల్ అవార్డ్ తీసుకున్న విషయం తెలిసిందే. మహంకాళి ఏసీపీ గంగాధర్‌, బేగంపేట మహిళా పోలీస్‌స్టేషన్‌ సీఐ జానకమ్మ, గోపాలపురం సీఐ రాంచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు.

బోరబండలోని ఇంట్లో శివకుమార్‌ ఉన్నాడని వారికి బుధవారం సమాచారం అందగా.. అక్కడికెళ్లి అతడిని పట్టుకున్నారు. ఓ హత్య సహా ఎనిమిది కేసుల్లో నిందితుడని.. పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని డీసీపీ చెప్పారు. అతడి అనుచరులు అడ్డగుట్టకు చెందిన జగదీష్‌, ఉప్పల్‌ చిలుకానగర్‌కు చెందిన జాదవ్‌ రాహుల్‌, ఎం. కృష్ణవేణి, పద్మ, మోండా మార్కెట్‌ గ్యాస్‌మండికి చెందిన గాలపల్లి శివానంద్‌ను కొద్దిరోజుల క్రితమే అరెస్టు చేసి జైలుకు తరలించామని పేర్కొన్నారు. వీరందరికీ శివకుమార్‌ బాస్‌ అని తెలిపారు.

Sex rocket busted by Sunitha krishnan

దేశంలో ఏటా లక్షలాది మంది అమ్మాయిల అక్రమ రవాణా జరుగుతుండడం విషాదం. అలాంటి పసిమొగ్గల్ని కాపాడుకునే లక్ష్యంతో ఏర్పడిందే ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ. దాదాపు రెండు దశాబ్ధాలకు ముందు ఏర్పడిన ఈ సంస్థ ఇప్పటికి దాదాపు పదివేల మందికిపైగా పునరావాసం కల్పించింది. ఆ సంస్థ వెనక సునీత కృషి దాగి ఉంది. దేశంలో ఎక్కడ అమ్మాయిలపై అకృత్యాలు జరిగినా వాటిపై స్పందించింది. తాను మాత్రమే కాదు..

ప్రభుత్వాలను పరుగులు పెట్టించింది. ఫలితంగా... అనితర సాధ్యమైన ఫలితాలనూ సాధించగలిగింది. ఆమె కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించింది. ఇప్పుడు సునీత కృష్ణన్ సేవలు ఖండాంతరాలకు విస్తరించాయి. టాల్‌బర్గ్ ఫౌండేషన్ అసాధారణ నాయకత్వ లక్షణాలతో 21 శతాబ్ధంలో ప్రపంచ సవాళ్లను ఎదుర్కోవడంలో దీటుగా స్పందించిన ఐదుగురిలో సునీత కృష్ణన్‌ని ఒకరుగా గుర్తించింది. టాల్‌బర్గ్ ఫౌండేషన్ గ్లోబల్ లీడర్స్ 2016 అవార్డ్‌ని సునీత కృష్ణన్‌కి ప్రకటించడం గమనార్హం.

English summary
Police Arrested a person who is Traping girls in tha name of movi offers, with help of Padma Sri-Sunitha Krishnan who is prodused a national award filim "naa bangaru talli"
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu