»   » రెండేళ్లుగా డేటింగ్: గుట్టు విప్పిన ప్రియమణి (ఫోటో పీచర్)

రెండేళ్లుగా డేటింగ్: గుట్టు విప్పిన ప్రియమణి (ఫోటో పీచర్)

Posted By:
Subscribe to Filmibeat Telugu

హైదరాబాద్: ఆశించిన రేంజిలో హిట్ హీరోయిన్ అనే పేరు సంపాదించక పోయినా....వరుస సినిమాలతో దక్షిణాదిన తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భామ ప్రియమణి. ఎట్టకేలకు ప్రియమణి తన పర్సనల్ లైఫుకు సంబంధించిన ఓ రహస్యాన్ని బట్టబయలు చేసింది. రెండేళ్లుగా ఓ వ్యక్తితో తాను ప్రేమలో ఉన్నానని చెప్పింది.

29 ఏళ్ల ప్రియమణి ఓ ప్రముఖ దిన పత్రికతో మాట్లాడుతూ...తను ఒక వ్యక్తితో గత రెండేళ్ల నుండి డేటింగ్ చేస్తున్నానని, అయితే అతను ఎవరో తాను ఇప్పుడే బయటకు చెప్పదలుచుకోలేదని, సమయం వచ్చినపుడు అతని వివరాలు బయటపెడతానని వెల్లడించింది. నన్ను, నా ఫీలింగ్స్‌ను అర్థం చేసుకునే అలాంటి వ్యక్తి దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రియమణి వెల్లడించింది.

అతను సినిమా ఇండస్ట్రీకి చెందిన వాడా? కాదా? అనే విషయంపై కూడా ప్రియమణి స్పష్టమైన వివరణ ఇచ్చింది. అందుకు సంబంధించిన వివరాలు స్లైడ్ షోలో..

ప్రియమణి బాయ్ ఫ్రెండ్

ప్రియమణి బాయ్ ఫ్రెండ్

ప్రియమణి తన బాయ్ ఫ్రెండుకు సంబంధించిన వివరాలు వెల్లడిస్తూ...అతను సినిమా పరిశ్రమకు చెందిన వాడు కాదని, ఇప్పుడే తమకు పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదని, పెళ్లికి చాలా సమయం ఉందని చెప్పుకొచ్చింది.

రెండేళ్ల తర్వాతే పెళ్లి

రెండేళ్ల తర్వాతే పెళ్లి

ప్రస్తుతం తన దృష్టంతా కెరీర్ పైనే ఉందని, మరో రెండేళ్ల తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తాను అని ప్రియమణి చెప్పుకొచ్చింది.

గ్లామర్ బొమ్మగా మాత్రమే కాదు....

గ్లామర్ బొమ్మగా మాత్రమే కాదు....

కెరీర్లో వివిధ రకాల పాత్రలు చేయాలని ఉందని, కేవలం గ్లామర్ డాల్ గా మిగిలిపోవాలనే ఉద్దేశ్యం తనకు లేదని, అందుకే అన్నిరకాల పాత్రలు చేస్తున్నానని చెబుతోంది ప్రియమణి.

చాలెంజింగ్ రోల్స్

చాలెంజింగ్ రోల్స్

కెరీర్లో ఎలాంటి ఛాలెంజింగ్ రోల్స్ అయినా తాను చేయడానికి రెడీ అంటున్న ప్రియమణి, మంచి నటిగా గుర్తింపు తెచ్చుకోవడమే తన లక్ష్యమని చెబుతోంది.

అవకాశాలు లేవు

అవకాశాలు లేవు

గతంలో తెలుగు, తమిళ చిత్రాల్లో వరుస అవకాశాలు దక్కించుకున్న ప్రియమణికి గడ్డుకాలం నడుస్తోంది. ఆమె చేతిలో ఒక్క తమిళ సినిమా కూడా లేదు. తెలుగులో అంగుళీక అనే చిత్రం మొదలైనా....అది ఆలస్యం అవుతూ వస్తోంది.

ప్రస్తుత సినిమాలు

ప్రస్తుత సినిమాలు

ప్రస్తుతం ఆమె కన్నడలో అంబరీషా అనే చిత్రంలో, మళయాలంలో పేటింగ్ లైఫ్, ఆలిస్ ఎ ట్రూ స్టోరీ అనే చిత్రాల్లో నటిస్తోంది.

English summary
Priyamani is set to break millions of her fans' hearts, as there is a special news from her side. Well, the one of the sexiest actress of South has found her dream boy and the actress herself has confirmed that she is dating someone.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu