»   » పొట్టి దుస్తులేసుకోవాలని వేధించారు: సంచలన విషయాలు బయటపెట్టిన ఆనంది

పొట్టి దుస్తులేసుకోవాలని వేధించారు: సంచలన విషయాలు బయటపెట్టిన ఆనంది

Posted By:
Subscribe to Filmibeat Telugu

అసభ్య కరమైన దుస్తులు ధరించాల్సింది గా తనమీద ఒత్తిడి జరిగిన మాట నిజమే అని స్పష్టం చేసింది ఆనంది. "త్రిష ఇల్లన్నా నయనతార" చిత్ర విడుదల సమయంలో ఆ చిత్ర దర్శకుడిపై విమర్షలు చేసిన సంగతి తెలిసిందే. "త్రిష ఇల్లన్నా నయనతార" చిత్రం తరువాత జీవీ.ప్రకాశ్‌కుమార్‌తో రెండో సారి ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు (నాకు ఇంకో పేరు ఉంది) చిత్రంలో నటించింది.

నాకు ఇష్టం లేకుండానే నటినయ్యాను.చదువుకునే రోజుల్లో నటనపై ఎలాంటి ఆసక్తి లేదు. "కయల్" చిత్రంలో కథానాయకిగా అవకాశం ఇచ్చి దర్శకుడు ప్రభుసాల్మన్ నాకు గుర్తింపు తెచ్చిపెట్టారు. దాంతో ఇక వరుస ఆఫర్లు వస్తూండటం తో నటిగానే స్థిరపడాలని నిర్ణయించుకున్నాను.అంటూ చెప్పుకొచ్చింది.

anandi

అయితే అంత ఆనందకరం గా ఏం లేదట అమ్మడి సినీ జీవితం ప్రారంభం లోనూ ఈ మధ్యే చేసిన మరో సినిమాలోనూ కొన్ని చేదు అనుభవాలు ఎదురయ్యాయట.. "కొన్ని చిత్రాల్లో అరకొర దుస్తులు ధరించి అశ్లీలంగా నటించమని ఒత్తిడి చేశారు. చాలా అసౌకర్యానికి గురయ్యాను. అయితే అలా నటించేదిలేదని, కాదంటే షూటింగ్ స్పాట్ నుంచి వెళ్లిపోతానని బెదిరించాను.

గ్లామరస్ దుస్తులు నా శరీరాకృతికి సరిపడవు. అందువల్ల అలాంటి దుస్తులు ధరించకూడదని ముందుగానే నిర్ణయించుకున్నాను. ఇదే విషయాన్ని చిత్రాన్ని అంగీకరించే ముందే దర్శక నిర్మాతలకు తెలియజేస్తాను. ఇప్పటీకీ కథ విన్నప్పుడే గ్లామరస్‌గా నటించను, టూపీస్ దుస్తులు ధరించను అని దర్శకుడితో చెప్పేస్తాను." అంటూ తన ఇబ్బందులనూ. సినీ రంగం లో స్త్రీలకు ఎదురయ్యే ఇబ్బందికర పరిస్థితులనూ చెప్పుకొచ్చింది.

అయితే ఇనక్కు ఇన్నోరు పేర్ ఇరుక్కు చిత్రంలో మంచి పాత్రలో నటించే అవకాశం లభించింది. ఈ సినిమాలో విలన్ అయిన ఒక దాదా కి కూతురుగా కనిపించనుంది, అయితే పనిలో పనిగా ఈ సినిమాలో అవకాశం ఇప్పించింది జీవీ.ప్రకాష్ అనుకుంటున్నారనీ కానీ అందులో నిజంలేదనీ చెప్పి పాపం ప్రకాష్ గాలి తీసేసింది ఆనంది

English summary
heroine Anandi share some bitter expeariences with some Directors in film industry.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu