twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    'బస్‌స్టాప్‌' చిత్రం నిషేధించాలంటూ ధర్నా

    By Srikanya
    |

    హైదరాబాద్ : 'ఈ రోజుల్లో' ఫేమ్ మారుతి దర్శకత్వం లో రూపొందిన చిత్రం 'బస్‌స్టాప్‌'. 'లవర్స్‌ అడ్డా' అనేది ఉపశీర్షిక తో వచ్చిన ఈ చిత్రం ఈ రోజే విడడుల అయ్యింది. అయితే అప్పుడే ఈ చిత్రంపై వివాదాలు మొదలయ్యాయి. విద్యార్థులను, యువతను తప్పుదోవ పట్టించేలా బస్‌స్టాప్‌ సినిమాలో సంభాషణలూ, దృశ్యాలూ ఉన్నాయని ఎస్‌ఎఫ్‌ఐ ఆరోపించింది. ఈరోజు ఆ సంస్థ నగరంలోని ఆర్టీసీ క్రాస్‌ రోడ్డు వద్ద ఆ సినిమా ప్రదర్శిస్తున్న థియేటరు ఎదుట ధర్నా నిర్వహించింది.

    ఎస్‌ఎఫ్‌ఐ కార్యకర్తలు సెన్సార్‌ బోర్డుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హాలులోనికి దూసుకెళ్లేందుకు ప్రయత్నించిన ఆందోళనకారులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. అభ్యంతరకరంగా ఉన్న సన్నివేశాలను తొలగించాలని నినాదాలు చేస్తూ సెన్సార్‌బోర్డు దిష్టిబొమ్మను ఆందోళనకారులు తగలబెట్టారు.

    ప్రిన్స్‌, శ్రీదివ్య, సాయికుమార్‌ పంపన, ఖన్నా ప్రధాన పాత్రలు పోషించారు. హాసిక, గోపాల్‌సాయి, రావు రమేష్‌, శ్రీను, డి.ఎం.కె, రావిపల్లి రాంబాబు తదితరులు ఈ చిత్రంలో నటించారు. సంగీతం: జె.బి. ఛాయాగ్రహణం: జె.ప్రభాకరరెడ్డి. డ్డి, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: జి. శ్రీనివాసరావు, సహ నిర్మాత: బి. మహేంద్రబాబు. ఈ చిత్రానికి కూర్పు: ఎస్.బి. ఉద్ధవ్, కళ: గోవింద్, కొరియోగ్రఫీ: రఘు, సతీశ్, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: మారుతి. బెల్లంకొండ సురేష్‌, బెల్లంకొండ గణేష్‌బాబు నిర్మాతలు.

    English summary
    
 Director Maruti's "Bus Stop" film relesed today. SFI are doing Dharna in front of theaters to stop the movie screening. Bellamkonda Suresh is produced this film. Suresh says that he found Maruti's script very entertaining.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X