»   » విక్రమ్ భట్ లేటెస్ట్ హర్రర్ 'శాపిత్‌' కధేంటి?

విక్రమ్ భట్ లేటెస్ట్ హర్రర్ 'శాపిత్‌' కధేంటి?

Posted By:
Subscribe to Filmibeat Telugu

బాలీవుడ్ దర్శకుడు విక్రమ్ భట్ రూపొందించిన హర్రర్ చిత్రం 'శాపిత్‌' ఈ రోజు దేశం అంతటా రిలీజవుతోంది. ఈ చిత్రం కథ ఈ విధంగా సాగుతుంది. గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్న అమన్‌(ఆదిత్య నారాయణ్‌), కాయా(శ్వేతా అగర్వాల్‌) పెద్దల అనుమతితో పెళ్ళిక రెడీ అవుతారు. నిశ్చితార్థం కూడా జరిగిపోతుంది. అయితే వాళ్ళు తిరిగి వస్తున్న కారు ఏక్సిడెంట్ అవుతుంది. పరిస్ధితి సీరియస్ గా ఉంటుంది. ఆలా చావు అంచుదాకా వెళ్లిన వారిని చూడటానికి వచ్చిన కాయా తల్లిదండ్రులు వస్తారు. వారు ఓ విషయం అమన్ కి చెబుతారు. అది విన్న అమన్ మొదట నమ్మడు కానీ తర్వాత ఆధారాలు కనపడేసరికి నమ్మక తప్పదు. వారు చెప్పిన విషయం ఏమిటంటే...దాదాపు మూడు వందల ఏళ్ల కిందట ఓ బ్రాహ్మణుడు కోపంతో వారి వంశీకులకు శాపం ఇస్తారు. వారి ఇంట్లో ఆడపిల్లను ఎవరైనా పెళ్లి చేసుకొంటే వారికి చావు తప్పదు అని. ఇది విన్న అమన్‌ ఆధ్యాత్మికవేత్త పశుపతిని కలిసి తన ప్రాణాన్ని ఎలా కాపాడుకొన్నాడు..? అసలు అతన్ని చంపడానికి వచ్చే అతీత శక్తి ఏమిటి? ఇవన్నీ 'శాపిత్‌'లో చూడాల్సిందే. ఇక హీరో, హీరోయిన్స్ ఇద్దరూ కొత్త వారితో రూపొందిన ఈ చిత్రంపై మంచి అంచనాలే ఉన్నాయి. గతంలో విక్రమ్‌ భట్‌ 1920 అనే హర్రర్ చిత్రాన్ని రూపొందించిన సంగతి తెలిసిందే.

 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu