»   » 25 ఏండ్లలో స్పెషల్ ఫొటో.. బాలీవుడ్‌లో సెన్సేషన్.. మరిన్ని చిత్రాలు..

25 ఏండ్లలో స్పెషల్ ఫొటో.. బాలీవుడ్‌లో సెన్సేషన్.. మరిన్ని చిత్రాలు..

Posted By:
Subscribe to Filmibeat Telugu

సినీ పరిశ్రమలో ఇద్దరు అగ్రనటులు కలుసుకోవడం చాలా అరుదుగా ఉంటాయి. ఫ్యాన్స్ గొడవ, ఇగో, సమయం దొరకకపోవడం అందుకు ప్రధాన కారణాలని చెప్పొచ్చు. తాజాగా దంగల్ చిత్రం రికార్డు విజయంతో జోష్ మీద ఉన్న ఆమీర్, రయీస్‌తో మంచి హిట్‌ను సాధించిన షారుక్‌ఖాన్ ఇటీవల దుబాయ్‌లో ఓ ప్రైవేట్ బర్త్‌డే ఫంక్షన్‌లో కలుసుకొన్నారు. అయితే వీరిద్దరూ కలిసి దిగిన ఫొటో ఇంటర్నెట్‌లో సంచలనం రేపుతున్నది.

చాలాకాలం తర్వాత కలిసిన ఆమీర్, షారుక్

చాలాకాలం తర్వాత కలిసిన ఆమీర్, షారుక్

బర్త్ డే పార్టీలో ఆమీర్‌ఖాన్‌తో దిగిన ఫొటోను షారుక్‌ఖాన్ ఫొటోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. గత 25 ఏండ్లలో తొలిసారి ఆమీర్‌తో కలిసిన దిగిన అరుదైన ఫొటో అని ట్వీట్ చేశారు. శుక్రవారం రాత్రి దుబాయ్‌లో జరిగిన పారిశ్రామికవేత్త అజయ్ బిజ్లీ జన్మదిన వేడుకకు ఇద్దరు అగ్రనటులు హాజరై సందడి చేశారు.

25 ఏండ్లలో తొలిసారి ఫొటో..

25 ఏండ్లలో తొలిసారి ఫొటో..

‘గత రాత్రి వేడుకలో పాల్గొనడం గొప్ప అనుభూతిని కలిగించింది. 25 ఏండ్లుగా ఒకరికొకరు పరిచయం. మేము ఇద్దరం కలిసి తీసుకొన్న తొలి ఫొటో ఇది. పార్టీ చాలా ఫన్‌గా సాగింది' అని షారుక్ ఖాన్ ట్విట్టర్ తెలిపారు.

తెల్లటి దుస్తులతో పార్టీ మిలమిల..

తెల్లటి దుస్తులతో పార్టీ మిలమిల..

విందు నిబంధనల ప్రకారం తెల్లని దుస్తులు ధరించి ఆమీర్, షారుక్ పార్టీకి హాజరయ్యారు. బర్త్‌డే బాయ్ అజయ్‌తో కలిసి ఫొటోకు ఫోజిచ్చారు. ట్విట్టర్‌లో పోస్ట్ చేసిన కొద్ది సేపట్లోనే ఆ ఫొటోను దాదాపు 6000 సార్లు రీట్వీట్ చేశారు. 18 వేల లైక్స్ వచ్చాయి.

పలు రూమర్లకు ఈ ఫోటో తెర

పలు రూమర్లకు ఈ ఫోటో తెర

అమీర్, షారుక్‌ల మధ్య విభేదాలున్నాయని వస్తున్న రూమర్లకు ఈ ఫొటో తెరదించింది. గత కొన్నేండ్లుగా వీరిద్దరూ కలిసిన దాఖలాలు లేవు. కలిసినా వారిద్దరూ కలిసి మాట్లాడుకున్న సందర్భాలు తక్కువ. ఫొటోకు పోజిచ్చింది అరుదు. ఈ నేపథ్యంలో ఈ అగ్రనటులను అజయ్ బర్త్ డే కలిపింది. ఇద్దరి అభిమానుల్లో జోష్ నింపింది. ఈ సందర్భంగా పారిశ్రామిక వేత్త అజయ్ వీరిద్దరూ మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

English summary
Shah Rukh Khan posed a Photo with Aamir Khan for the first time in 25 years on late Friday They were in Dubai to attend entrepreneur Ajay Bijli’s birthday bash.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu