»   » షారుక్‌కు అమీర్ పరామర్శ.. మన్నత్ భేటీ వెనుక భారీ..

షారుక్‌కు అమీర్ పరామర్శ.. మన్నత్ భేటీ వెనుక భారీ..

Posted By:
Subscribe to Filmibeat Telugu

ఇటీవల భుజానికి సర్జరీ జరిగిన బాలీవుడ్ బాద్షా షారుక్‌ఖాన్‌ను మిస్టర్ ఫర్ఫెక్ట్ అమీర్‌ఖాన్, నెట్ ఫ్లిక్స్ సీఈవో రీడ్ క్యాస్టింగ్స్‌తో కలిసి పరామర్శించారు. షారుక్ నివాసమైన మన్నత్‌తో జరిగిన వీరి సమావేశం భారీ ప్రణాళిక ఉన్నట్టు తెలుస్తున్నది. శనివారం రాత్రి ఖాన్లతో మంచి సమయాన్ని గడిపాం అని నెట్‌ఫ్లిక్స్ కంపెనీ ట్వీట్ చేసింది. షారుక్, అమీర్ ఖాన్ లిద్దరూ నెట్ ఫ్లిక్స్ కంపెనీకి ప్రచారకర్తలుగా ఉన్నారు.

షారుక్ ఖాన్ త్వరలోనే టెడ్ ఎక్స్ అనే టెడ్ టాక్స్ ఇండియా: నయీ సోచ్ అనే కార్యక్రమాన్ని హోస్ట్ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని స్టార్ ప్లస్ ప్రసారం చేయనున్నది. ప్రస్తుతం ఇంతియాజ్ అలీ దర్శకత్వంలో అనుష్క శర్మ సరసన షారుక్ ఖాన్ ఓ చిత్రంలో నటిస్తుననారు. ఆ తర్వాత ఆనంద్ రాయ్ డైరెక్షన్‌లో ఓ చిత్రాన్ని చేయడానికి అంగీకరించారు.

అమీర్ ఖాన్ సీక్రెట్ సూపర్ స్టార్ అనే చిత్రంలో అతిథి పాత్రను షోషిస్తున్నారు. త్వరలోనే థగ్స్ ఆఫ్ హిందుస్థాన్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ చిత్రానికి దర్శకత్వం విజయ్ కృష్ణ ఆచార్య వహిస్తుండగా ఓ కీలక పాత్రలో అమితాబ్ కనిపించనున్నారు. వీరిద్దరీ కలయిక వెనుక అనేక రూమర్లు ప్రచారంలో ఉన్నాయి. అమీర్, షారుక్‌తో కలిపి ఓ చిత్రానికి రంగం సిద్ధమవుతున్నదనే వార్త విస్తృతంగా ప్రచారమవుతున్నది.

English summary
Shah Rukh Khan and Aamir Khan came together to pose for a picture with Netflix CEO Reed Castings. Are we up for a major announcement. Aamir met Shah Rukh at the latter's castle, Mannat.
 

తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu